యూపీలో హత్రాస్ తరహాలో మరో దారుణం

హత్రాస్ ఘటనపై దేశం ఒకవైపు అట్టుడుకుతోంటే.. ఉత్తరప్రదేశ్ లో మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.

యూపీలో హత్రాస్ తరహాలో మరో దారుణం
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 01, 2020 | 11:56 AM

హత్రాస్ ఘటనపై దేశం ఒకవైపు అట్టుడుకుతోంటే.. ఉత్తరప్రదేశ్ లో మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. హత్రాస్‌కు 500 కి.మీ. దూరంలో ఉన్న బలరాంపూర్‌లో ఓ దళిత యువతిపై బుధవారం దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడి అనంతరం హతమార్చారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలోని బల్‌రామ్‌పూర్‌కు చెందిన 22 ఏళ్ల యువ‌తి కాలేజీ అడ్మిష‌న్ కోసం ఉద‌యం 10 గంట‌ల‌కు ఇంటి నుంచి బ‌య‌ల్దేరింది. అనంత‌రం సాయంత్రం ఇంటికి తిరిగి వ‌స్తుండగా ఇద్ద‌రు యువ‌కులు అడ్డ‌ుకున్నారు. ఆమెకు మ‌త్తు మందు ఇచ్చి లైంగికదాడి ఒడిగట్టారు.

ఇదిలావుంటే, సాయంత్రం 7 గంటల సమయంలో నడవలేని స్థితిలో, చేతికి సెలైన్‌ బాటిల్‌తో ఇంటికి చేరింది. కూతరు పరిస్థితిని చూసిన కుటుంబసభ్యులు ఆమెను వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ప‌రిస్థితి విషమించ‌డంతో.. మెరుగైన చికిత్స నిమిత్తం ల‌క్నోకు త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోనే యువ‌తి ప్రాణాలు విడిచింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతికి మ‌త్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన‌ట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డి అయింది. మృగాళ్లు ఆమె నడుమును విరచడంతో పాటు శరీర భాగాలను తీవ్రంగా గాయపరిచారని వైద్యులు వెల్లడించారు. ఇక, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా.. అందులో ఒక నిందితుడు మైనర్ అని తెలుస్తోంది.