Sajjala fire on Babu: ఓటమి భయంతోనే విపక్ష పార్టీల డ్రామాలు.. చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్

తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల కలకలం సృష్టిస్తోంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు టీడీపీ నేతలు.

Sajjala fire on Babu: ఓటమి భయంతోనే విపక్ష పార్టీల డ్రామాలు.. చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్
Sajjala Ramakrishna Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 17, 2021 | 3:40 PM

తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల కలకలం సృష్టిస్తోంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు టీడీపీ నేతలు. 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు. తిరుపతి పోలింగ్‌లో జరిగిన ఘటనలపై ఫిర్యాదు చేయనున్నారు.

అయితే, ఓటమి భయంతోనే విపక్ష పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌‌లో గందరగోళాన్ని సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారన్నారు.

కాగా, చంద్రబాబు ప్రవర్తించిన తీరుపై సజ్జల ఆసహానం వ్యక్తం చేశారు. పోలింగ్‌పై టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, తిరుపతికి వచ్చే టూరిస్టులు దొంగ ఓటర్లని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందనని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తాను గతంలో చేసిన పనులను తమ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఓడిపోతారని తెలిసే బాబు ముందుగా సాకులు వెతుక్కుంటున్నారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మహన్‌రెడ్డి‌ వెంట 75 శాతానికిపైగా ఓటర్లు ఉన్నారని సజ్జల గుర్తు చేశారు. దొంగ ఓట్లు వేసే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డిపాజిట్‌ కూడా దక్కదనే భయంతోనే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సజ్జల అన్నారు.

Read Also… Nara Lokesh: ‘పుంగునూరు వీరప్పన్ పెద్దిరెడ్డి’.. ఏపీ మంత్రిపై నారా లోకేష్ తీవ్ర విమర్శలు.!

ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..