ఎక్కడికైనా వెళ్లొచ్చు.. ఎవరినైనా విచారణ చేయొచ్చు..
విచారణలో భాగంగా పోలీసులు ఎక్కడికైనా వెళ్లవచ్చవని.. ఎవరినైనా విచారణ చేయవచ్చని ఏపీ డీజీపీ ఠాకూర్ అన్నారు. గుంటూరులో భాస్కర్ అనే ఐటీ గ్రిడ్ ఉద్యోగి మిస్సింగ్ కేసులో భాగంగానే పోలీసులు హైదరాబాద్ ఐటీ గ్రిడ్ కార్యాలయానికి వెళ్లారని ఆయన తెలిపారు. దీనిపై రాద్ధాంతం తగదన్నారు డీజీపీ ఠాకూర్. ఐటీ గ్రిడ్ ఉద్యోగి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగానే లోకేశ్వర్ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారని డీజీపీ ఠాకూర్ చెప్పారు. ఐటీ గ్రిడ్ సీఈవో ఏపీలో ఉన్నట్లు […]

విచారణలో భాగంగా పోలీసులు ఎక్కడికైనా వెళ్లవచ్చవని.. ఎవరినైనా విచారణ చేయవచ్చని ఏపీ డీజీపీ ఠాకూర్ అన్నారు. గుంటూరులో భాస్కర్ అనే ఐటీ గ్రిడ్ ఉద్యోగి మిస్సింగ్ కేసులో భాగంగానే పోలీసులు హైదరాబాద్ ఐటీ గ్రిడ్ కార్యాలయానికి వెళ్లారని ఆయన తెలిపారు. దీనిపై రాద్ధాంతం తగదన్నారు డీజీపీ ఠాకూర్.
ఐటీ గ్రిడ్ ఉద్యోగి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగానే లోకేశ్వర్ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారని డీజీపీ ఠాకూర్ చెప్పారు. ఐటీ గ్రిడ్ సీఈవో ఏపీలో ఉన్నట్లు తమకు సమాచారం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ఓట్ల తొలగింపు కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు.



