బస్సులు బంద్.. కీలకంగా మారిన ‘మెట్రో’..!!
దసరా పండుగకు ముందు తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాలు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ యూనియన్లు అక్టోబర్ 5 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వంతో చేసిన చర్చలు విఫలం కావడంతో.. గత అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు… సమ్మె సైరన్ మోగించారు. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలతో పాటు.. జిల్లాల వారీగా.. బస్సులు డిపోలలో నిలిచిపోయాయి. సమ్మె సైరన్‌తో.. తెలంగాణ ప్రభుత్వం.. ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే.. ప్రైవేటు బస్సులు, స్కూల్ […]
దసరా పండుగకు ముందు తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాలు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ యూనియన్లు అక్టోబర్ 5 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వంతో చేసిన చర్చలు విఫలం కావడంతో.. గత అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు… సమ్మె సైరన్ మోగించారు. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలతో పాటు.. జిల్లాల వారీగా.. బస్సులు డిపోలలో నిలిచిపోయాయి.
సమ్మె సైరన్‌తో.. తెలంగాణ ప్రభుత్వం.. ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే.. ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సులు తిప్పేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రైవేట్ వాహనాలకు రవాణా శాఖ రూట్‌ల వారీగా ధరలు నిర్ణయించింది. ధరలు పెంచి నడిపితే కను చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. కాగా.. మరోవైపు సమ్మె ఎఫెక్ట్ కారణంగా.. మెట్రోపై పడ్డారు జనాలు. దీంతో.. ప్రతీ మెట్రో స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతోన్నాయి. అలాగే.. వీటికి సంబంధించి మెట్రో అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతీ రెండు, మూడు నిమిషాలకు రైలు ఉండేలా చూస్తున్నారు. అలాగే.. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకూ మెట్రో రైల్‌ను నడపనున్నారు.