సుజీత్ కోసం ప్రార్థిస్తూ..తమ చిన్నారిని కోల్పోయారు..

సుజీత్..గత కొన్ని రోజులుగా దేశం మొత్తం వినిపించిన పేరు. ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డ ఈ చిన్నారి క్షేమంగా బయటకి రావాలని దేశం మొత్తం ప్రార్థించింది. తమిళనాడులో నివశిస్తున్న ఓ కుటుంబం కూడా అందుకు మినహాయింపు కాదు. ఆ చిన్నారి ప్రాణాలతో బయటకి వచ్చి..కన్నవాళ్లకు చేరువవ్వాలని సదరు కుటుంబానికి చెందిన భార్యభర్తలు కూడా కోరుకున్నారు. టీవీలో సుజీత్ సంబంధించిన వార్తలను నిశితంగా గమనిస్తూ దేవున్ని ప్రార్థిస్తున్నారు. కానీ వారు మంచి కోరుకుంటున్నా కూడా దైవం మాత్రం ఆ ఇంట్లో […]

సుజీత్ కోసం ప్రార్థిస్తూ..తమ చిన్నారిని కోల్పోయారు..
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 29, 2019 | 8:57 PM

సుజీత్..గత కొన్ని రోజులుగా దేశం మొత్తం వినిపించిన పేరు. ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డ ఈ చిన్నారి క్షేమంగా బయటకి రావాలని దేశం మొత్తం ప్రార్థించింది. తమిళనాడులో నివశిస్తున్న ఓ కుటుంబం కూడా అందుకు మినహాయింపు కాదు. ఆ చిన్నారి ప్రాణాలతో బయటకి వచ్చి..కన్నవాళ్లకు చేరువవ్వాలని సదరు కుటుంబానికి చెందిన భార్యభర్తలు కూడా కోరుకున్నారు. టీవీలో సుజీత్ సంబంధించిన వార్తలను నిశితంగా గమనిస్తూ దేవున్ని ప్రార్థిస్తున్నారు. కానీ వారు మంచి కోరుకుంటున్నా కూడా దైవం మాత్రం ఆ ఇంట్లో తీరని విషాదాన్ని మిగిల్చాడు. ఆదమరిచి ఉండటంతో వారి రెండేళ్ల పాప నీటి డ్రంబులో పడి ప్రాణాలు కోల్పోయింది.

తమిళనాడు త్రెస్పురం గ్రామంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. మూడేళ్ల పసిపాప రేవతి సంజన నిన్న రాత్రి ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి చనిపోయింది. ఆ సమయంలో పాప తల్లిదండ్రులు బోరుబావిలో పడిపోయిన సుజిత్ గురించి టీవీలో వస్తున్న వార్తలు చూస్తున్నారు. ఫలితంగా వారు చిన్నారిని గమనించలేదు. దీంతో ఈ అనుకోని సంఘటన  జరిగిపోయింది. తరువాత కొద్దిసేపటికి పాప నీటి డ్రంబులో విగతజీవిగా ఉండటం చూసి తల్లీదండ్రులు నిశ్చేష్టులైపోయారు. హుఠాహుఠిన ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. పాప అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.