షాకింగ్‌ న్యూస్.. ఒకే “ఐఎమ్ఈఐ” నెంబర్‌తో వేల ఫోన్లు..!

ఐఎమ్ఈఐ.. ఇంటర్ నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ.. ఇది మనం వాడే ప్రతి ఫోన్‌కు ఉండే  నెంబర్. దీని ఆధారంగా మనం వాడే సిమ్ గురించి సదరు సంస్థకు తెలుస్తుంది.

షాకింగ్‌ న్యూస్.. ఒకే ఐఎమ్ఈఐ నెంబర్‌తో వేల ఫోన్లు..!
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 6:11 PM

ఐఎమ్ఈఐ.. ఇంటర్ నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ.. ఇది మనం వాడే ప్రతి ఫోన్‌కు ఉండే  నెంబర్. దీని ఆధారంగా మనం వాడే సిమ్ గురించి సదరు సంస్థకు తెలుస్తుంది. అంతేకాదు.. ఆ మొబైల్‌లో వేరే సిమ్ కార్డు మార్చినా ఆ విషయాన్ని ఐఎమ్ఈఐ నంబర్ ద్వారా ట్రేస్ చేయవచ్చు. అయితే ఇదంతా న్యాయ పరంగా జరిగే ప్రాసెస్. అందుకే మన ఫోన్లు పోగొట్టుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు ఫోన్ ఐఎమ్ఈఐ నెంబర్ ఉందా అని ప్రశ్నిస్తారు. ఎందుకంటే దాని ద్వారా ఆ ఫోన్‌ను ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాంటి ఐఎమ్‌ఈఐ నెంబర్ ఒక ఫోన్‌కు ఒకటే ఉంటుంది. కానీ తాజాగా యూపీలో ఓ షాకింగ్ విషయం బయటపడింది.

మీరట్‌లో బయటపడ్డ ఈ విషయాన్ని అక్కడి పోలీసులు వివరించారు. వారు తెలిపిన ప్రకారం.. ఒకే ఐఎమ్ఈఐ నెంబర్‌తో దేశంలో దాదాపు 13,500 ఫోన్లు ఉన్నాయని తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మీరట్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి మొబైల్ కొద్ది రోజుల క్రితం పాడైపోయింది. దీంతో దాన్ని రిపేర్ చేసేందుకు టెక్నీషియన్‌కు ఇచ్చినప్పటికీ మళ్లీ సేమ్ సమస్య తలెత్తుతోంది. దీంతో ఆ ఫోన్‌లో ఏం సమస్య ఉందో తెలుసుకొవాలంటూ సైబర్‌ క్రైంకు చెందిన ఓ సిబ్బందికి ఇచ్చారు. ఈ క్రమంలో అసలు విషయం బయటపడింది. ఫోన్‌కు అసలు సమస్య ఐఎమ్ఈఐ నెంబర్ అని తేలింది. దీంతో సదరు మొబైల్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీరట్ ఎస్పీ స్పందించారు. దాదాపు 13,500 సెల్ ఫోన్లకు ఒకే ఐఎమ్ఈఐ నెంబర్‌తో వాడకంలో ఉన్నాయని.. ఇది సెక్యురిటీకి సంబంధించిన అంశమని.. కంపెనీ నిర్లక్ష్యం ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.