భూ యాజమానుల వాటా పెంచిన హెచ్‌ఎండీఏ..!

హెచ్‌ఎండీఏ పరిధిలోని భూ యాజమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇకపై హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూ యజమానులకు 10 శాతం వాటా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.

భూ యాజమానుల వాటా పెంచిన హెచ్‌ఎండీఏ..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 05, 2020 | 6:13 PM

హెచ్‌ఎండీఏ పరిధిలోని భూ యాజమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇకపై హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూ యజమానులకు 10 శాతం వాటా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భూ యజమానులకు 60 శాతం, హెచ్‌ఎండీఏకు 40 శాతం వరకు వాటా రానుంది. ఇప్పటివరకు భూయజమానులకు 50 శాతం, హెచ్‌ఎండీఏకు 50 శాతంగా ఉంటోంది. కొత్త జీవో ప్రకారం ల్యాండ్‌పూలింగ్‌ భూములకు భద్రత, ప్రయోజనం చేకూరుస్తామని హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చేవారికి సమస్య లేకుండా చూస్తామన్న హెచ్‌ఎండీఏ.. అన్నిరకాల అనుమతులు సకాలంలో పూర్తయ్యేలా తామే చూస్తామని తెలిపింది. భూములిచ్చిన వారి రిజిస్ట్రేషన్‌ ఖర్చులు కూడా తామే భరిస్తామని హెచ్‌ఎండీఏ పేర్కొంది. లేఔట్‌, ముసాయిదా ఆమోదం పొందిన 6 నెలల్లో భూ యజమానులకు ప్లాట్లు కేటాయిస్తామని స్పష్టం చేసింది. ఫ్లాట్ల క్రయవిక్రయాలకు సంబంధించి యాజమానులకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో 500 ఎకరాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నట్లు హెచ్‌ఎండీఏ తెలిపింది.

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..