AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళపై భర్త, నలుగురు స్నేహితుల లైంగికదాడి

కేరళ లో దారుణం జరిగింది. ఓ మహిళపై తన భర్త, నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరువనంతపురం జిల్లా వెటుత్తర బీచ్ లో ఈ దారుణం చోటుచేసుకుంది.

మహిళపై భర్త, నలుగురు స్నేహితుల లైంగికదాడి
Balaraju Goud
|

Updated on: Jun 05, 2020 | 5:44 PM

Share

కేరళ లో దారుణం జరిగింది. ఓ మహిళపై తన భర్త, నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరువనంతపురం జిల్లా వెటుత్తర బీచ్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. సిగరెట్ వాతలు పెడుతూ హింసిస్తూ కిరాతకాన్ని ప్రదర్శించారు దుర్మార్గులు. వెటుత్తరలో 25 ఏళ్ల మహళ, తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటోంది. తాజాగా వెటుత్తర బీచ్ కి సరదా కోసం పిల్లలతో కలిసి దంపతులిద్దరూ వెళ్లారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న స్నేహితుడి ఇంటికి వారిని తీసుకుని వెళ్లాడు భర్త. అక్కడ బాధితురాలి చేత బలవంతంగా మద్యం తాగించారు భర్తతో పాటు అతని స్నేహితులు. ఆపై అతి కిరాతకంగా సిగరెట్ తో వాతలు పెడుతూ కన్న కొడుకు ఎదుటే భర్తతో సహా అతని నలుగురు స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. గాయాలతో, స్పృహలేని స్థితిలో రోడ్డుపై పడి ఉన్న బాధితురాలిని ఓ యువకుడు గమనించి ఇంటికి చేర్చాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. బాధితురాలకి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

Follow Us
ఏడేళ్ల తర్వాత.. మళ్లీ జబర్దస్త్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు..
ఏడేళ్ల తర్వాత.. మళ్లీ జబర్దస్త్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు..
ఇదేం ప్రతీకారం వరుణ్ భయ్యా.. పరాగ్ వికెట్ తీసి ఇలా చేశావేంటి..?
ఇదేం ప్రతీకారం వరుణ్ భయ్యా.. పరాగ్ వికెట్ తీసి ఇలా చేశావేంటి..?
బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, హీరోయిన్‏గా...
బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, హీరోయిన్‏గా...
హైదరాబాద్ టు విజయవాడ.. అక్కడి నుంచి భీమవరం.. ఎంతకు తెగించావ్..
హైదరాబాద్ టు విజయవాడ.. అక్కడి నుంచి భీమవరం.. ఎంతకు తెగించావ్..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్కటి మార్చండి.. వేల రూపాయలు ఆదా చేయోచ్చు
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్కటి మార్చండి.. వేల రూపాయలు ఆదా చేయోచ్చు
నేను చనిపోయానని ఆర్జీవీ బోరున ఏడ్చాడు.. టాలీవుడ్ హీరో..
నేను చనిపోయానని ఆర్జీవీ బోరున ఏడ్చాడు.. టాలీవుడ్ హీరో..
పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన
పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన
సన్ ఫ్లవర్ Vs రైస్ బ్రాన్ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సన్ ఫ్లవర్ Vs రైస్ బ్రాన్ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
ధ్రువ్ జురెల్ మెరుపు విన్యాసం.. నోరెళ్లబెట్టిన కామెరూన్ గ్రీన్..!
ధ్రువ్ జురెల్ మెరుపు విన్యాసం.. నోరెళ్లబెట్టిన కామెరూన్ గ్రీన్..!
తెలంగాణలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే.?
తెలంగాణలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే.?