అఖిలప్రియ భర్త భార్గవ్ కి నోటీసులు..!

మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌కు పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర కేసులో పోలీసులు నోటీసులు.

  • Balaraju Goud
  • Publish Date - 8:16 pm, Fri, 5 June 20
అఖిలప్రియ భర్త భార్గవ్ కి నోటీసులు..!

కర్నూలు జిల్లా మరోసారి రాజకీయ గొడవలతో హీటెక్కింది. మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌కు పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల కడప పట్టణంలోని చిన్నచౌక్‌ వద్ద నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఏవీ సుబ్బారెడ్డి హతమార్చేందుకు ఫ్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గత నెల 15న మధ్యవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణను చిన్నచౌక్ పోలీసులు వేగవంతం చేశారు. ఇందుకు సంబంధించిన కేసు విచారణకు హాజరుకావాలని అఖిలప్రియ భర్తకు నోటీసులిచ్చారు.