AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BIGG BOSS 4 : బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే స్టేజ్ పై మెగాస్టార్.. విజేతకు ట్రోఫీని అందించిన చిరు

అందరు ఊహించినట్లుగానే గ్రాండ్ ఫినాలేకు చిరునే హాజరయ్యారు. గత సీజన్‌లో ఫైనల్‌ షోకు ముఖ్య అతిథిగా హాజరైన మెగస్టార్ చిరంజీవే ఈసారి కూడా హాజరుకావడం విశేషం. ఇక విన్నర్ అయిన అభిజీత్ కు మెగాస్టర్ ట్రోఫీని అందించారు. అఖిల్ రన్నరప్ గా నిలిచాడు.

BIGG BOSS 4 : బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే స్టేజ్ పై మెగాస్టార్.. విజేతకు ట్రోఫీని అందించిన చిరు
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2020 | 11:35 PM

Share

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్4 ఫైనల్‌ షో అంగరంగ వైభవంగా జరిగింది. ఫైనల్‌ షోకు హాజరైన హీరోయిన్లు ప్రణీత, మెహరీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక నాలుగో సీజన్ నుంచి హారిక, అరియానా ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఈసారి బిగ్‌బాస్ విన్నర్ అభిజీత్ నిచ్చాడు.  అయితే ఎక్కువ మంది చిరు హాజరుకానున్నట్లు అభిప్రాయపడ్డారు. అందరు ఊహించినట్లుగానే గ్రాండ్ ఫినాలేకు చిరునే హాజరయ్యారు. గత సీజన్‌లో ఫైనల్‌ షోకు ముఖ్య అతిథిగా హాజరైన మెగస్టార్ చిరంజీవే ఈసారి కూడా హాజరుకావడం విశేషం. ఇక విన్నర్ అయిన అభిజీత్ కు మెగాస్టర్ ట్రోఫీని అందించారు. అఖిల్ రన్నరప్ గా నిలిచాడు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Dec 2020 11:23 PM (IST)

    ‘నీ సినిమాలో నేను నటిస్తా’.. సోహెల్ కు మాటించిన మెగాస్టార్

    సింగరేణి ముద్దు బిడ్డ సోహెల్ కు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. సోహెల్ నీ సినిమాలో నేను నటిస్తా అంటూ మాటిచ్చారు మెగాస్టార్. దాంతో ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు సోహెల్.

  • 20 Dec 2020 11:11 PM (IST)

    సోహెల్ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్

    బిగ్ బాస్ సీజన్ 4 లో అభిజీత్ విజేతగా నిలిచాడు. ఇక ఈ సీజన్ లోని కంటెస్టెంట్స్ పై చిరు అనురాగం కురిపించారు. సోహెల్ కోసం చిరంజీవి తన ఇంట్లో ప్రత్యేకంగా మటన్ బిరియానీ తయారు చేయించి బిగ్ బాస్ షో కు తీసుకువచ్చారు.

  • 20 Dec 2020 11:02 PM (IST)

    రన్నరప్ గా నిలిచిన అఖిల్.. ఇంతవరకు రావడం గర్వంగా ఉంది

    అఖిల్ రన్నరప్  గా నిలిచాడు. నాగార్జునకు, చిరంజీవికి, తనను ఇక్కడివరకు తీసుకువచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన అఖిల్

  • 20 Dec 2020 10:46 PM (IST)

    పాజిటివ్ వైబ్స్ ఎక్కడికి పోవు.. కంటెస్టెంట్స్ అందరూ విన్నర్లే : అభిజీత్ అమ్మ

    కంటెస్టెంట్స్ అందరు విన్నర్లే .. పాజిటివ్ వైబ్స్ ఎక్కడికిపోవని, అవే అభిజీత్ ను విన్నార్ ను చేశాయి అని అభిజీత్ తల్లి తెలిపారు.

  • 20 Dec 2020 10:44 PM (IST)

    ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలిపిన అభిజీత్

    బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన అభిజీత్ మాట్లాడుతూ.. తనను విన్నర్ గా నిలబెట్టిన ప్రేక్షకులకు పాదాభివందనం చేసిన అభి , అదేవిధంగా నాగార్జునకు కృతజ్ఞతలు అభిజీత్ తెలిపాడు .

  • 20 Dec 2020 10:29 PM (IST)

    దివికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్

    చిరంజీవి నటిస్తున్న వేదాళమ్ సినిమాలో దివికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.  త్వరలోనే మనం కలిసి నటించనున్నాం అన్న చిరు. ఆనందం లో తేలిపోయిన దివి

  • 20 Dec 2020 10:27 PM (IST)

    నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుంది.. మెగాస్టార్ కాళ్ళమీద పడ్డ మెహబూబ్

    మెహబూబ్ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుందన్న చిరంజీవి. కన్నీళ్లు పెట్టుకుంటూ  చిరు కాళ్ళ మీద పడ్డ

  • 20 Dec 2020 10:22 PM (IST)

    అవినాష్ పైన మెగాస్టార్ మార్క్ కామెంట్స్

    అవినాష్ పైన  మెగాస్టార్ తనదైన శైలిలో కామెంట్ చేసారు..అవినాష్ మొదట్లో బాగానే ఆడాడన్న చిరు రాను రాను కోపం ఎక్కువైందని అన్నారు.

  • 20 Dec 2020 10:19 PM (IST)

    బిగ్ బాస్ సీజన్ 4 కు భారీ పోలైన ఓట్లు.. ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

    బిగ్ బాస్ 4 తెలుగు ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో అదిరిపోయే డాన్సులు, పాటలతో ఎపిసోడ్ మొదలైంది. సీజన్ 4లో ఫినాలే కోసం 15 కోట్ల 65 లక్షల ఓట్లు పోలైనట్లు చెప్పి షాక్ ఇచ్చాడు నాగార్జున. రెండింతలు కావడంతో షో సూపర్ సక్సెస్ అంటూ మురిసిపోయాడు నాగార్జున. పైగా లాక్ డౌన్, కరోనా కావడంతో ఓట్ల సంఖ్య మరింత పెరిగిపోయింది.

  • 20 Dec 2020 10:04 PM (IST)

    బిగ్ బాస్ ఫినాలే … విన్నర్ ను ప్రకటించిన మెగాస్టార్ అంచనా వేస్తున్నట్లే అభిజిత్ విజేత

    సోషల్ మీడియా అంచనా వేస్తున్నట్లే అభిజిత్ విజేతగా నిలిచాడు. నిన్నటి నుంచి బిగ్ బాస్ ఫలితాలు లీక్ అయిపోయి చక్కర్లు కొట్టేసాయి. ఆ లీకులే ఇవ్వాళ నిజమయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ విజేతను ప్రకటించారు.

  • 20 Dec 2020 10:01 PM (IST)

    ‘బిగ్‌బాస్ 4‌’ ఫైనల్… 3వ స్థానం చాలని రూ. 25 లక్షలతో వెనుదిరిగిన సొహైల్‌

    ‘బిగ్‌బాస్‌’ ఫైనల్‌ ఎపిసోడ్‌ని గ్రాండ్‌గా ప్లాన్‌ చేసింది స్టార్‌ మా. ఇక ఈ ఫైనల్ షో లో టాప్‌ 3 కంటెస్టెంట్స్‌గా అభిజిత్‌, అఖిల్‌, సొహైల్‌ మిగిలారు. అయితే టాప్‌ 3లో ఉన్న ఈ ముగ్గురి నుంచి సొహైల్‌ 3వ స్థానం చాలని చెబుతూ.. బిగ్‌బాస్‌ ఆఫర్‌ చేసిన రూ. 25 లక్షలతో బయటికి వచ్చేశాడు.

Published On - Dec 20,2020 11:23 PM