Big Boss For Telugu: బిగ్‌బాస్ రియాలిటీ షో వ్యక్తిత్వ వికాసానికి అద్భుత వేదిక.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.
బిగ్‌బాస్ రియాలిటీ షో వ్యక్తిత్వ వికాసానికి అద్భుత వేదిక అని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. బిగ్‌బాస్ విజేతను ప్రకటించిన తర్వాత చిరు మాట్లాడుతూ... ‘బిగ్‌బాస్ రియాలిటీ షో ఎన్నో కొత్త విషయాలు నేర్పించింది. రకరకాల వ్యక్తిత్వాలను ఎలా డీల్ చేయాలో ఈ షో నేర్పించింది.
chiru about bigboss show: బిగ్‌బాస్ రియాలిటీ షో వ్యక్తిత్వ వికాసానికి అద్భుత వేదిక అని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. బిగ్‌బాస్ విజేతను ప్రకటించిన తర్వాత చిరు మాట్లాడుతూ… ‘బిగ్‌బాస్ రియాలిటీ షో ఎన్నో కొత్త విషయాలు నేర్పించింది. రకరకాల వ్యక్తిత్వాలను ఎలా డీల్ చేయాలో ఈ షో నేర్పించింది. ఏం చేయాలి..? ఎలా చేయాలి.? లాంటి విషయాలను ఈ షో ద్వారా నేర్చుకోవచ్చు. వ్యక్తిగత వికాసాన్ని నేర్చుకోవడానికి మనము డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం తిరిగి డబ్బులు చెల్లించి మరీ ఇవన్నీ నేర్పిస్తోంది. బిగ్‌బాస్ హౌజ్‌లో నేర్చుకున్న పాఠాలను ఇక్కడే వదిలేయకుండా జీవితంలో కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిగ్‌బాస్ ఫైనల్‌కు అతిథిగా ఎవరెవరో వస్తారని వార్తలు వచ్చాయి. కానీ నా స్నేహితుడు రమ్మని కోరడంతో నేను వచ్చాను. థ్యాంక్స్ నాగ్’ అంటూ చిరు చెప్పుకొచ్చాడు.