Bigg Boss 4 : బిగ్‌బాస్4 ఫినాలే ప్రత్యేక అతిథి మెగాస్టారే… మరోసారి బిగ్‌బాస్ ఫినాలేకు హాజరైన చిరంజీవి.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్4 ఫైనల్ షో అంగరంగ వైభవంగా మొదలైంది. ఫైనల్ షోకు హాజరైన హీరోయిన్లు ప్రణీత, మెహరీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Mega star in bigg boss finale: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్4 ఫైనల్ షో అంగరంగ వైభవంగా మొదలైంది. ఫైనల్ షోకు హాజరైన హీరోయిన్లు ప్రణీత, మెహరీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక నాలుగో సీజన్ నుంచి హారిక, అరియానా ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఈసారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరనే విషయం మరికొద్ది సేపట్లోనే తెలిసిపోనుంది. అయితే విజేతను ఎవరు ప్రకటించనున్నారనే విషయం మాత్రం స్టార్ మా రహస్యంగా ఉంచింది. ఈ విషయమై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎక్కువ మంది చిరు హాజరుకానున్నట్లు అభిప్రాయపడ్డారు. అందరు ఊహించినట్లుగానే గ్రాండ్ ఫినాలేకు చిరునే హాజరయ్యారు.
The Gangleader #Megastar @KChiruTweets is back on stage again for #BBTeluguGrandFinale #BiggBossTelugu4 pic.twitter.com/2thYqnw3Fa
— starmaa (@StarMaa) December 20, 2020
ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. గత సీజన్‌లో ఫైనల్ షోకు ముఖ్య అతిథిగా హాజరైన మెగస్టార్ చిరంజీవే ఈసారి కూడా హాజరుకావడం విశేషం. గ్యాంగ్ లీడర్ పాటకు స్టెప్పులేస్తూ చిరు స్టేజ్ మీదికి వచ్చిన వీడియోను స్టార్ మా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈ వీడియో పోస్ట్ చేసి కొద్ది క్షణాల్లోనే రికార్డు వ్యూలను దక్కించుకోవడం విశేషం.