Bigg Boss 4 : బిగ్ బాస్ అనుభవాలను పంచుకున్న కంటెస్టెంట్స్ .. ఎమోషనల్ అయిన అవినాష్

బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే మంచి జోష్ తో మొదలైంది. హోరెత్తించే డ్యాన్సలతో కంటెస్టెంట్స్ అంతా స్టేజ్ పైన సందడి చేసారు. అదిరిపోయే సాంగ్ తో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు.

  • Rajeev Rayala
  • Publish Date - 9:00 pm, Sun, 20 December 20
Bigg Boss 4 : బిగ్ బాస్ అనుభవాలను పంచుకున్న కంటెస్టెంట్స్ .. ఎమోషనల్ అయిన అవినాష్

బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే మంచి జోష్ తో మొదలైంది. హోరెత్తించే డ్యాన్సలతో కంటెస్టెంట్స్ అంతా స్టేజ్ పైన సందడి చేసారు. అదిరిపోయే సాంగ్ తో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఆతర్వాత ఒక్కోకోరుగా కంటెస్టెంట్స్ స్టేజ్ పైకి వచ్చారు. 19మంది కంటెస్టెంట్ల‌తో మొద‌లైన సీజ‌న్ 4లో ఐదుగురు ఇంటి స‌భ్యులు అభిజిత్‌, అఖిల్‌, సోహైల్‌, అరియానా, హారిక ఫైన‌ల్ కు చేరుకున్న విష‌యం తెలిసిందే. వీరిలో ఎవరు విజేత అవుతారన్నది ఆసక్తిగా మారింది. అయితే  ఫినాలే స్టేజ్ పైకి వచ్చిన కంటెస్టెంట్స్ అంతా వాళ్ళ బిగ్ బాస్ జర్నీని గుర్తుచేసుకుంటూ… కనీళ్ళు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ తన బిగ్ బాస్ అనుభవాలను పంచుకున్నారు. బిగ్ బాస్ షోకు ముందు త‌ర్వాత నా జీవితం వేరుగా ఉంది. ఇంత‌కు ముందు మా ఊరు వాళ్లు మాత్ర‌మే ఫొటోలు దిగేవారు. కానీ బిగ్ బాస్ షోలో క‌నిపించిన చాలా జిల్లాల‌కు చెందిన వాళ్లు నాతోపాటు మా అమ్మ‌తో కూడా ఫొటోలు దిగుతున్నారనిఎమోషనల్ అయ్యాడు అవినాష్.