హైదరాబాద్ నాంపల్లిలో కారు బీభత్సం..ప్రమాద ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు.. కారు నడిపిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వచ్చి రాని డ్రైవింగ్‌తో రోడ్లపైకి వస్తే ఇలాగే ఉంటుంది. హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ కేఫ్ ముందు ఓ యువకుడు కారు డ్రైవింగ్ వల్ల ఏర్పడ్డ బీభత్సం చూస్తే అర్ధమవుతుంది.
వచ్చి రాని డ్రైవింగ్‌తో రోడ్లపైకి వస్తే ఇలాగే ఉంటుంది. హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ కేఫ్ ముందు ఓ యువకుడు కారు డ్రైవింగ్ వల్ల ఏర్పడ్డ బీభత్సం చూస్తే అర్ధమవుతుంది.
రోడ్డుపై వెళ్లాల్సిన కారు షడన్‌గా పక్కనే ఉన్న కేఫ్‌వైపు దూసుకొచ్చింది. ఆ సమయంలో అక్కడ జనం కంటే వాహనాలు ఎక్కువగా ఉండటంతో కారు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ కారు బీభత్సంలో అక్కడ పనిచేస్తున్న వాచ్‌మెన్‌కి తీవ్రగాయాలయ్యాయి. ఒకటి రెండు కాదు…ఏడు బైకులు ధ్వంసమయ్యాయి.
కారు యాక్సిడెంట్ లైవ్‌లో చూసిన జనం పరుగెత్తుకుంటూ వచ్చి గాయపడ్డ వాచ్‌మెన్‌ని పక్కకు తీసుకొచ్చి కూర్చోపెట్టారు. స్విఫ్ట్ కారు నడిపిన యువకుడు అశ్విన్‌ని స్పాట్‌లోనే పట్టుకున్నారు. యాక్సిడెంట్ సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు కారు నడిపిన అశ్విన్‌ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.