అవును మా నాన్న డిఫెన్స్‌లో పనిచేశారు.. కానీ: రూమర్లపై నోయల్ సోదరుడు
బిగ్‌బాస్ హౌజ్‌లో గతవారం కంటెస్టెంట్‌లు వారి వ్యక్తిగత విషయాలను పంచుకున్న విషయం తెలిసిందే. తమ జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడకు వచ్చామని పలువురు కంటెస్టెంట్‌లు భావోద్వేగానికి లోనయ్యారు
Noel brother on Rumors: బిగ్‌బాస్ హౌజ్‌లో గతవారం కంటెస్టెంట్‌లు వారి వ్యక్తిగత విషయాలను పంచుకున్న విషయం తెలిసిందే. తమ జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడకు వచ్చామని పలువురు కంటెస్టెంట్‌లు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా సింగర్ నోయల్ కూడా తన జీవితం గురించి పలు విషయాలు వెల్లడించారు. తన అమ్మ అందరి ఇళ్లల్లో పని చేసేదని, నాన్న ఇస్త్రీ, మేస్త్రీ ఇలా చేస్తూ రకరకాల పనులు చేసేవాడని చెప్పుకొచ్చారు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ అని.. నాన్న ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చినట్లు వివరించారు.
అయితే ఆ తరువాత వికీపీడియాలో నోయల్ తండ్రి డిఫెన్స్ ఉద్యోగి అని ఉండటంతో యాంటీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సింపథీ కోసం నోయల్ తండ్రి గురించి అబద్ధం చెప్పాడని కొంతమంది తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలో వాటిపై అతడి సోదరుడు స్పందించారు. నోయల్ చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదని స్పష్టం చేశారు.
అవును మా నాన్న డిఫెన్స్‌లో పనిచేశారు. డిఫెన్స్ అనగానే శాస్త్రవేత్తో, ఆఫీసరో అనుకుంటున్నారు. కానీ ఆయన సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. ఆ సమయంలోనూ ఆటో నడిపేవారు. డిఫెన్స్‌లోకి వెళ్లకముందు రకరకాల పనులు చేసేవాడు. మా అన్నయ్య కూడా ఇంటర్ తరువాత చార్మినార్‌లో బుక్ షాపులో పని చేశాడు. మా వీధిలో పాలు పోసేవాడు. న్యూస్ పేపర్లు కూడా వేసేవాడు. ఎన్నో కష్టాలు పడి అన్నయ్య ఇక్కడివరకు వచ్చాడు. అన్నయ్యకు పీఆర్ టీమ్ లేదు. నేను మాత్రమే పోస్టులు చేస్తున్నా. దయచేసి మా సోదరుడిపై తప్పుడు ప్రచారం చేయకండి అని వెల్లడించారు. ఈ సందర్భంగా తమ తండ్రి ఇస్త్రీ చేస్తున్న ఫొటోలను కూడా అతడు పంచుకున్నారు.
Read More: