Bigg Boss4: మోనాల్, అవినాష్ రొమాన్స్.. సచ్చిపోండి మీరిద్దరు అన్న అరియానా
బిగ్‌బాస్ 4లో ఈ వారం లగ్జరీ టాస్క్‌లో భాగంగా కొంటె రాక్షసులు- మంచి మనుషులు అనే టాస్క్‌ని బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లకు ఇచ్చిన విషయం తెలిసిందే.
Monal Avinash romance: బిగ్‌బాస్ 4లో ఈ వారం లగ్జరీ టాస్క్‌లో భాగంగా కొంటె రాక్షసులు- మంచి మనుషులు అనే టాస్క్‌ని బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముగ్గురు రాక్షసులను మనుషులుగా మార్చితే మంచి మనుషుల టీమ్ గెలిచినట్లు అని బిగ్‌బాస్ ప్రకటించారు. ఈ క్రమంలో మంగళవారం నాటి ఎపిసోడ్‌లో ఇప్పటికే అఖిల్, హారికలను రాక్షసుల నుంచి మనుషులుగా మార్చేశారు. ఇక ఈ టాస్క్ ఇవాళ కూడా కొనసాగనుంది.
ఈ నేపథ్యంలో ఓ ప్రోమోను విడుదల చేశారు. అందులో రాక్షస టీమ్‌లోని అవినాష్, మనుషుల టీమ్‌లోని మోనాల్ రొమాన్స్ చేస్తూ కనిపించారు. నువ్వు రాక్షిసిగా మారిపోవచ్చు కదా అని అవినాష్ అడగ్గా.. మీరు మనుషులుగా మారిపోవచ్చు కదా అని మోనాల్ చెప్పింది. నువ్వు రాక్షసిగా మారిపోతే ఈ రాజ్యమే నీకు ఇస్తానని అవినాష్ చెప్పాడు. ఇక వీరి రొమాన్స్‌ని చూసిని అరియానా సచ్చిపోండి మీరిద్దరు అంటూ అక్కడి నుంచి లేచింది. అప్పుడు అరియానా నువ్వు కూడా ఇక్కడ ఉందురా అని అవినాష్ పిలిచాడు. ఇక రావణుడు మారితే మనమందరం మారినట్లే అని రాక్షసుడి టీమ్‌లోని మెహబూబ్ చెప్పగా.. నేను మారనంటూ అవినాష్ శపథం చేశాడు. ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ ప్రోమో బాగా ఆకట్టుకుంటోంది.
Read More:
రానా ‘అరణ్య’కు విడుదల తేది ఖరారు.. థియేటర్లలో ఎంజాయ్ చేయండన్న టీమ్