Bigg Boss 4: అభిజిత్, అఖిల్‌ల మధ్య గొడవ.. మీరే చూసుకోండన్న నాగార్జున
శనివారం ఎపిపోడ్‌లో భాగంగా అఖిల్‌కి ఓ ప్రశ్నను వేశారు నాగార్జున. హౌజ్‌లో ముందు ఒకలా, వెనుక మరోలా ప్రవర్తించేవారు ఎవరు..?
Abhijeet Akhil fight: శనివారం ఎపిపోడ్‌లో భాగంగా అఖిల్‌కి ఓ ప్రశ్నను వేశారు నాగార్జున. హౌజ్‌లో ముందు ఒకలా, వెనుక మరోలా ప్రవర్తించేవారు ఎవరు..? అని నాగార్జున ప్రశ్నించారు. దీంతో అందరు ఊహించినట్లే అభిపేరు చెప్పాడు అఖిల్. ఫ్రెండ్ షిప్‌లో కూడా ముందు ఒకలా, తరువాత ఒకలా ఉంటాడని అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక దీనికి అభి స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యాడు.
అఖిల్ గురించి చాలా మాట్లాడాలి. మీ ముందు మాట్లాడదామని ఎదురుచూశా. నేను ముందు ఒకలా, వెనుక మరోలా మాట్లాడాల్సిన అవసరం లేదు. అఖిల్ ముందే మాట్లాడుతున్నా. నామినేషన్స్ అంటేనే ఒప్పుకోలేని ఓ వ్యక్తి హౌజ్‌లో నుంచి వెళ్లిపోవాలి అని బిగ్‌బాస్ చెప్పిప్పుడు వెళ్లిపోవడానికి రెడీ అయ్యాడన్న పాయింట్‌పైనే నేను మాట్లాడా..? అతను నిప్పుతో ఆడుకుంటున్నాడు. మటన్ షాప్ యజమాని గడ్డి పెడితే మేక లోపలికి వెళ్లిపోతుందా?.. అతడికి లక్ ఉంది కాబట్టే తిరిగి వచ్చాడు. ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని తానే పెద్దగా వ్యవహరిస్తాడు. మాట్లాడితే మోనాల్‌ని తీసుకుని వస్తాడు అని క్లియర్‌గా చెప్పేశాడు అభి. ఇక వీరిద్దరి వాదనలు విన్న నాగ్.. మీ మధ్య విభేధాలకు సరైన పరిష్కారం ఏంటో నాకు అర్థంకావడం లేదు. మీ సమస్యకు మీరే పరిష్కారం తేల్చుకోండి అని చెప్పేశారు.