Bigg Boss 4: నేను లేకపోతే ఏమైపోతావో: అవినాష్ పులిహోర
హౌజ్‌లోకి వచ్చినప్పటి నుంచి అరియానాతో పులిహోర కలుపుతూ వస్తున్నాడు అవినాష్. కుదిరినప్పుడు ఆమెతో ముచ్చట్లు పెడుతూ అరియానాతో
Avinash Ariyana conversation: హౌజ్‌లోకి వచ్చినప్పటి నుంచి అరియానాతో పులిహోర కలుపుతూ వస్తున్నాడు అవినాష్. కుదిరినప్పుడు ఆమెతో ముచ్చట్లు పెడుతూ అరియానాతో పాటు వీక్షకులకు ఎంటర్‌టైన్ పంచుతున్నాడు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్‌లో దివికి ఫ్రెండ్‌షిప్ లెటర్ ఇచ్చిన అవినాష్.. ఆ తరువాత అరియానా దగ్గర వాలిపోయాడు. దగ్గురుండి మేకప్ వేశాడు. చంద్రముఖిలా ఉండే నువ్వు ఇప్పుడు ఎలా అయ్యావో చూడు అంటూ కామెంట్లు పెట్టాడు. అంతేకాదు నేను లేకపోతే ఏమైపోతావో అని కబుర్లు చెప్పుకొచ్చాడు. వీరిద్దరి ఎపిసోడ్ ఫన్నీగా అనిపించింది.
ఇదిలా ఉంటే మార్నింగ్ మస్తీలో భాగంగా బిగ్‌బాస్ సభ్యులను కాసేపు హౌజ్‌లోని పరిసరాలు, వస్తువులుగా మారమన్నాడు. దీంతో సోహైల్ కిచెన్‌గా మారిపోయాడు. దీంతో దొరికిందే ఛాన్స్ అని అందరూ అతడిని చపాతీలా రుబ్బుతూ, పాత్రలు తోముతున్నట్లూ సాకులు చెప్తూ ఆటాడేసుకున్నారు. ఆ తరువాత అవినాష్ బెడ్‌లా మారిపోగా, అమ్మ రాజశేఖర్ అతడిపై పడుకొని విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం అఖిల్ వాష్‌రూమ్‌గా మారిపోగా, మాస్టర్ అందులోనే స్నానం, నిద్ర అన్నీ చేస్తూ కాస్త ఇబ్బంది పెడుతూనే నవ్వించారు. ఇక మోనాల్ తలుపుగా మారిపోగా.. అందరూ రోబో టాస్క్‌ని గుర్తు చేస్తూ విరుచుకుపడ్డారు. ఇక దివి కాసేపు డస్ట్‌బిన్‌లా మారిపోయి ఫన్‌ని ఇచ్చింది.
Read More:
Bigg Boss 4: దివికి అవినాష్ లెటర్.. చదివిన మాస్టర్ రియాక్షన్ సూపర్
Bigg Boss 4: అమీ తుమీ టాస్క్.. ఏడ్చేసిన హారిక.. కుమార్ సాయి కేకలు