Bigg Boss 4: అమీ తుమీ టాస్క్‌.. ఏడ్చేసిన హారిక.. కుమార్ సాయి కేకలు

సోమవారం ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ స్పైసీగా నడవగా.. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో అమీ తుమీ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్

Bigg Boss 4: అమీ తుమీ టాస్క్‌.. ఏడ్చేసిన హారిక.. కుమార్ సాయి కేకలు
Follow us

| Edited By:

Updated on: Oct 14, 2020 | 7:15 AM

Bigg Boss 4 Ami Tumi Task: సోమవారం ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ స్పైసీగా నడవగా.. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో అమీ తుమీ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అందులో భాగంగా రెండు టీమ్‌లుగా ఇంటి సభ్యులను విడగొట్టాడు. అరియానాకు రెడ్‌, అఖిల్‌కి బ్లూ టీమ్‌ని ఇచ్చాడు. అరియానా టీమ్‌లో అభిజిత్‌, మెహ‌బూబ్‌, లాస్య‌, అవినాష్‌, మోనాల్ ఉండ‌గా.. అఖిల్ టీమ్‌లో హారిక, నోయల్, దివి, కుమార్, అమ్మ రాజశేఖర్‌లు ఉన్నారు. సోహైల్‌ని సంచాలకుడిగా వ్యవహరించమన్నారు. ఇక ఈ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ రెండు టీమ్‌లకు స‌మంగా బంగారు నాణేలు ఇచ్చారు. టాస్క్ ముగిసే వరకు బిగ్‌బాస్‌తో ఎక్కువ డీల్స్ ఏ టీమ్‌ కుదుర్చుకుని ఎక్కువ నాణేలు ఖ‌ర్చుపెడుతుందో.. వారే గెలిచినట్లు‌. అలాగే గెలిచిన‌ టీమ్ స‌భ్యులే కెప్టెన్సీకి పోటీ పడతారని బిగ్‌బాస్ చెప్పాడు.

ఇక మొదటి డీల్‌లో భాగంగా మగ సభ్యుడు ఒంటి మీదున్న బట్టలను కత్తిరించేయాలి. అందుకు 10 బంగారు నాణేలు ఇవ్వాలి. మొదట అఖిల్‌ బెల్‌ కొట్టడంతో అతడి టీమ్‌లో కుమార్ సాయి షర్ట్‌ను ముక్కలు ముక్కులుగా కత్తిరించాడు. అయితే ఆ షర్టు సోహైల్‌ది కావడంతో అతడు ఎక్కువగా బాధపడ్డాడు.

రెండో డీల్‌లో భాగంగా ఇంటి సభ్యుల్లో ఒకరు వారికి సంబంధించిన దుస్తులు, వస్తువులన్నింటినీ బయటకు పంపాలి. అందుకు 20 నాణేలు ఇవ్వాలి. అరియానా మొదట బెల్‌ కొట్టగా ఆమె టీమ్‌లోని అభిజిత్ ఒంటి మీదున్న బట్టలు మినహా తనకు చెందినవన్నీ బయటకు పంపించేశాడు.

మూడో డీల్‌లో భాగంగా అమ్మాయి తన జుట్టును మెడపై వరకు కత్తిరించుకొని రెడ్ కలర్ వేసుకోవాలి అందుకు 25 నాణేలు చెల్లించాలి. అఖిల్ మొదట‌ గంట కొట్ట‌డంతో అతడి టీమ్‌లోని హారిక హెయిర్ క‌ట్ చేయించుకునేందుకు రెడీ అయింది. ఈ సందర్భంగా హారిక చాలా బాధపడింది. మొదట కత్తిరించుకునేందుకు చాలా ఆలోచించింది.  షోకు వ‌చ్చేముందే ఇలా హెయిర్ క‌ట్ చేయించుకోవ‌ద్ద‌ని తన అన్న‌య్య మ‌రీమ‌రీ చెప్పాడని, తనకు జుట్టు ఎక్కువ పెరగదని మాట్లాడింది. ఇక టాస్క్‌లో భాగంగా తప్పకపోవడంతో.. నోయ‌ల్ జుట్టు క‌త్తిరించే సమయంలో సారీ అన్నయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తాను వెళ్లిపోయేలోపు తన జుట్టు పెరిగేలా మసాజ్ చేసే బాధ్యత ఇంటి సభ్యులదని చెప్పింది.

నాలుగో డీల్‌లో భాగంగా ఇసుక మూట‌ను ఒక్క ‌చేత్తో మార్కు కింద‌కు వెళ్ల‌కుండా చూడాలి. బిగ్‌బాస్ త‌దుప‌రి ఆదేశాల వచ్చే వ‌ర‌కు ఆ ఇసుక మూట అదే స్థానంలో క‌ద‌ల‌కుండా ఉండాలి. అందుకు 20 నాణేలు చెల్లించాల్సి ఉంటుంది. అఖిల్ టీమ్‌లో కుమార్ సాయి ఈ సవాల్‌ స్వీక‌రించాడు. చాలాసేపు అవుతుండటంతో నోయ‌ల్ అతడికి నీళ్లు తాగిపించాడు. కానీ స‌మ‌యం మించుతుండటంతో నొప్పిని భ‌రించ‌లేక కేక‌లు పెట్టాడు. కానీ మొత్తానికి సవాల్‌ని విజ‌య‌వంతంగా పూర్తి చేశాడు.

ఐదో డీల్‌లో భాగంగా స్టోర్‌ రూమ్ ద్వారా పంపించే వస్తువులతో ఓ డ్రింక్ తయారు చేస్తారని, అది రెండు గ్లాసులు తాగాల్సి ఉంటుంది. ఇందుకు 20 నాణేలు చెల్లించాలి. అరియానా గంట కొట్టడంతో లాస్య ఈ సవాల్‌ని స్వీకరించింది. ముక్కు మూసుకొని రెండు గ్లాసులను కష్టపడి తాగేసింది. మా జున్ను కోసం ఇది చేశానని చెప్పింది. లాస్య కోసం అఖిల్‌ పాటను పాడి నవ్వించాడు.

ఆరో డీల్‌లో భాగంగా ఓ ఇంటి సభ్యుడు బిగ్‌బాస్‌ తదుపరి ఆదేశం వరకు జూట్‌తో అల్లిన బట్టలను ధరించాలి. అందుకు 20 నాణేలు చెల్లించాలి. అరియానా గంట కొట్టడంతో.. ఆమె టీమ్‌లోని మోనాల్‌ జూట్‌తో అల్లిన దుస్తులను ధరించింది. ఆ తరువాత మాస్టర్ ఆమెతో కోయ డ్యాన్స్ వేయించాడు. ఇక ఈ టాస్క్‌ ఇవాళ కూడా కొనసాగనుంది.

Read More:

మరో రెండు, మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో అతి భారీవర్షాలు !

Alert : ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి