Bigg Boss 4: ‘బిగ్‌బాస్’లో సందడి చేయనున్న అనుష్క.. !
బిగ్‌బాస్ వీక్షకులకు మరో గుడ్‌న్యూస్. ఈ షోలో ముద్దుగుమ్మ అనుష్క సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ వీక్షకులకు మరో గుడ్‌న్యూస్. ఈ షోలో ముద్దుగుమ్మ అనుష్క సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఇవాళ్టి ఎపిసోడ్‌లోనే అని సమాచారం. అయితే అనుష్క నటించిన నిశ్శబ్దం అక్టోబర్ 2న ఓటీటీలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. పరిస్థితులు బావుంటే ఈ పాటికి ఈ మూవీ ప్రమోషన్లు బాగా జరిగేవి. కానీ కరోనాతో పరిస్థితులు మారగా.. ప్రమోషన్లను కూడా ఆన్‌లైన్‌లోనే కానిచ్చేస్తున్నారు. దాంతో సినిమా అందరికీ చేరడం లేదు.
ఈ క్రమంలో ఇప్పుడు బుల్లితెరపై బిగ్‌బాస్ కొనసాగుతుండటంతో నిశ్శబ్దం టీమ్ అందులోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బుల్లితెరపై ఈ షో హవా కొనసాగుతుండటం, ఎక్కువ మందికి చేరే అవకాశం ఉండటంతో నిశ్శబ్దం యూనిట్ ఈ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా అనుష్క టీమ్ హౌజ్‌లోకి వెళ్లి కంటెస్టెంట్‌లతో సందడి చేయనున్నట్లు సమాచారం. అయితే గతంలోనూ బిగ్‌బాస్‌లో ప్రమోషన్లు జరిగాయి. ఇక ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈ సీజన్‌లో బయటి వారిని లోపలికి పంపడం లేదు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వెళ్లే వారిని సైతం క్వారంటైన్‌లో పెట్టి పరీక్షలు చేసి పంపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అనుష్క టీమ్ హౌజ్ లోపలికి వెళ్తుందా..? లేక నాగార్జునతో స్టేజ్‌పైనే సందడి చేయనుందా..? అన్నది తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.
Read More: