Bigg Boss 4: ఈ వారం ఎలిమినేట్‌ అవ్వనున్న మెహబూబ్‌..!

బిగ్‌బాస్‌ సీజన్ 4లో ఇవాళ మూడో ఎలిమినేషన్ ఉండబోతోంది. ఈ వారానికి గానూ మోనాల్, లాస్య, దేవి, కుమార్ సాయి పంపన

Bigg Boss 4: ఈ వారం ఎలిమినేట్‌ అవ్వనున్న మెహబూబ్‌..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 26, 2020 | 1:28 PM

Bigg Boss 4 elimination: బిగ్‌బాస్‌ సీజన్ 4లో ఇవాళ మూడో ఎలిమినేషన్ ఉండబోతోంది. ఈ వారానికి గానూ మోనాల్, లాస్య, దేవి, కుమార్ సాయి పంపన, మెహబూబ్, అరియానా, హారికలు ఉన్నారు. ఈ క్రమంలో మెహబూబ్‌ పేరు వినిపిస్తోంది. మొదట్లో మెహబూబ్‌పై పెద్దగా నెగిటివ్ లేనప్పటికీ.. ఉక్కు హృదయం టాస్క్‌లో‌ ఓవరాక్షన్‌తో అతడి గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని తెలుస్తోంది. ఓ వెబ్‌సైట్ నిర్వహించిన పోల్‌లో మెహబూబ్‌కి వ్యతిరేకంగా చాలా మంది ఓటేశారు. ఈ క్రమంలో ఇవాళ అతడిని బయటకు పంపబోతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ వారం కంటెస్టెంట్‌లకు బిగ్‌బాస్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. దాన్ని బట్టి చూస్తే ఈ వారం కూడా నాగార్జున హౌజ్‌లోని సభ్యులకు గట్టి క్లాస్ పీకబోతున్నట్లు తెలుస్తోంది. అయితే శుక్రవారం హౌజ్‌లోకి సాక్షి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. నిన్నటి ఎపిసోడ్‌ని చూస్తే మోనాల్‌కి సాక్షి గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతోంది.

Read More:

ప్రియుడి బర్త్‌డే కోసం నయన్ చేసిన ఖర్చు ఎంతో తెలిస్తే..!

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలి