బిగ్ బాస్: ఫైనల్ అయిందా.. విన్నర్ ఎవరంటే..?

బిగ్ బాస్ రియాల్టీ షో ఎట్టకేలకు పన్నెండో వారానికి చేరుకుంది. ఫైనల్స్‌కు సమయం దగ్గర పడుతుండటంతో రోజు రోజుకి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేపుతోంది. నిన్నటి ఎపిసోడ్‌లో మహేష్ విట్టా ఎలిమినేట్ కావడంతో.. ఇప్పుడు ఏడుగురు సభ్యులు ఫైనల్‌కు చేరుకునేందుకు పోటీ పడుతున్నారు. అయితే ఫైనల్‌గా ఎవరు గెలుస్తారనే దానిపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఏడుగురు సభ్యులను చూసుకుంటే ప్రతిఒక్కరికీ విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం […]

బిగ్ బాస్: ఫైనల్ అయిందా.. విన్నర్ ఎవరంటే..?

బిగ్ బాస్ రియాల్టీ షో ఎట్టకేలకు పన్నెండో వారానికి చేరుకుంది. ఫైనల్స్‌కు సమయం దగ్గర పడుతుండటంతో రోజు రోజుకి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేపుతోంది. నిన్నటి ఎపిసోడ్‌లో మహేష్ విట్టా ఎలిమినేట్ కావడంతో.. ఇప్పుడు ఏడుగురు సభ్యులు ఫైనల్‌కు చేరుకునేందుకు పోటీ పడుతున్నారు. అయితే ఫైనల్‌గా ఎవరు గెలుస్తారనే దానిపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఏడుగురు సభ్యులను చూసుకుంటే ప్రతిఒక్కరికీ విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్‌గా శ్రీముఖీ టాలెంట్ అందరికీ తెలుసు. బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి ఇప్పటివరకూ శ్రీముఖీ ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. అదే జోష్‌లో ఇంట్లో కొనసాగుతోంది. ప్రతి టాస్క్‌లోనూ చాలా తెలివిగా ఆడుతుంది. ఇక బాబా భాస్కర్ ఫేమస్ డ్యాన్స్ మాస్టర్. తెలుగు భాష సరిగా రానప్పటికీ.. తన వ్యవహార శైలితో బాగా ఫేమస్ అయ్యాడు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ తన దైన శైలిలో కామెడీ చేస్తుంటాడు. సినిమాల్లో చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల దాకా అందరితోనూ బాబా స్టెప్పులు వేయించాడు.

శివజ్యోతి.. తెలంగాణ యాసతో చంపేస్తుంది. తీన్మార్ వార్తలతో ఫేమస్ అయిన శిశజ్యోతి.. బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఓ రేంజ్‌లో పేరు తెచ్చుకుంది. ఇటుకల టాస్క్‌లో ఒక్కసారిగా హైలెట్ అయిపోయింది. నాగార్జున నుంచి ప్రశంసలు అందుకుంది. ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకుంటూ.. అందరితోనూ కలిసిపోతూ టాస్క్‌లలో చెలరేగిపోతోంది. అలీ.. ఎలిమినేట్ అయి తిరిగి ఇంట్లోకి వచ్చినా తనకున్న ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా పెరిగిపోయింది. కాస్త మనస్పర్ధలు వచ్చినా.. ఇంటి సభ్యులంతా అలా రీ ఎంట్రి ఇవ్వడంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు.

రాహుల్ సిప్లిగంజ్.. పాపులర్ సింగర్. తన పాటలతో ఇట్టే కట్టిపడేస్తాడు. పునర్నవి ఎలిమినేట్ అయి వెళిపోయాక.. రాహుల్‌లో కాస్త జోష్ తగ్గింది. తమ టీం నుంచి ఒకరు వెళిపోయారని.. రెండు, మూడు రోజులు కాస్త బాధగా కనిపించినా.. వరుణ్, వితికాలు రాహుల్‌ని మార్చేశారు. ఇక వితికా ఈమెను అందరూ బిగ్ బాస్ ఇంటి కోడలు అని పేరు తెచ్చుకుంది. అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ.. ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెడుతుంది అని అంటారు. కాని టాస్క్‌ల విషయానికి వస్తే.. మహంకాళిలా చెలరేగిపోతుంది. మగవారికి ఏ మాత్రం తీసిపోకుండా ఆడుతుంది.

చివరిగా వరుణ్ సందేశ్. అమెరికా అబ్బాయి అని అంటారు. బిగ్ బాస్ ఇంటికి వచ్చిన మొదట్లో కాస్త అర్థం కాకపోయినా.. రాను రాను వరుణ్‌కి అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ.. అందరి మనసుకు దగ్గరయ్యాడు. ఎవరితో అయినా గొడవలు వచ్చినా.. చాలా ఈజీగా తీసుకుంటాడు. ఎప్పుడు ఎలిమినేష్‌కి వచ్చినా సేఫ్ అవుతూ వచ్చాడు. అయితే అందరిలోనూ చూసుకుంటే బాబా భాస్కర్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అతడి డ్యాన్స్ పర్ఫార్మెన్స్, వచ్చి రాని తెలుగు భాషకు అభిమానుల్లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ముందుగా ఎలిమినేట్ అయిన జాఫర్ కూడా బాబానే విన్ అవుతారని చెప్పారు. తాజాగా ఎలిమినేట్ అయిన మహేష్ కూడా బాబా భాస్కరే విన్ అవుతారని చెప్పాడు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లలో చూసుకుంటే.. ఓటింగ్ లిస్టులో కూడా బాబా నే ముందున్నారని టాక్ వినిపిస్తోంది.

Click on your DTH Provider to Add TV9 Telugu