బిగ్‌బాస్‌లో విలన్ అయిన శ్రీముఖి

బిగ్‌బాస్‌-3 తెలుగు షో మొదలైనప్పటినుంచీ రోజుకో వివాదం రాజుకుంటుంది. మొన్నటివరకూ రాహుల్, వితిక, వరుణ్, పునర్నవి హాట్ టాపిక్‌ అయితే.. ఆ తర్వాత.. తమన్నా.. వీరంగం సృష్టించింది. నిన్న షోలో అలీ, హిమజల మధ్య వివాదం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు హౌస్‌మెంట్స్ అందరికీ శ్రీముఖి విలన్ అయ్యింది. బిగ్‌బాస్.. మంగళవారం కంటెస్టెంట్స్‌కి ఓ టాస్క్ ఇచ్చాడు.. దీంతో.. అందరూ ఆ టాస్క్‌లో నమగ్నమై ఆడుతున్నారు. శ్రీముఖి, రవికృష్ణ, అషు రెడ్డి.. కథనం ప్రకారం నిధిని కొట్టేయడానికి […]

బిగ్‌బాస్‌లో విలన్ అయిన శ్రీముఖి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 08, 2019 | 12:21 PM

బిగ్‌బాస్‌-3 తెలుగు షో మొదలైనప్పటినుంచీ రోజుకో వివాదం రాజుకుంటుంది. మొన్నటివరకూ రాహుల్, వితిక, వరుణ్, పునర్నవి హాట్ టాపిక్‌ అయితే.. ఆ తర్వాత.. తమన్నా.. వీరంగం సృష్టించింది. నిన్న షోలో అలీ, హిమజల మధ్య వివాదం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు హౌస్‌మెంట్స్ అందరికీ శ్రీముఖి విలన్ అయ్యింది.

బిగ్‌బాస్.. మంగళవారం కంటెస్టెంట్స్‌కి ఓ టాస్క్ ఇచ్చాడు.. దీంతో.. అందరూ ఆ టాస్క్‌లో నమగ్నమై ఆడుతున్నారు. శ్రీముఖి, రవికృష్ణ, అషు రెడ్డి.. కథనం ప్రకారం నిధిని కొట్టేయడానికి ప్లాన్ వేస్తారు. రాహుల్, వితికా, వరుణ్, రోహిణి, అలీ నిధిని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటారు. శివజ్యోతి, బాబా భాస్కర్ పోలీసులు, హిమజ లాయర్‌గా వ్యవహరిస్తూంటారు.

కాగా.. మహేష్ ఇచ్చిన సలహా మేరకు.. బాబా భాస్కర్‌తో మాట్లాడి.. నిధిని దొంగిలించాలని.. శ్రీముఖి డంబుల్‌ తీసుకుని.. నిధి బాక్స్‌ను కొడుతుంది. దీంతో.. వితిక, వరుణ్, రాహుల్, అలీ.. అందరూ గట్టిగా అరుస్తూ.. నిధి చుట్టూ నించుంటారు. అక్కడేవున్న రవిని.. శ్రీముఖి నిధి బాక్స్‌ను కొట్టు.. కొట్టు.. అంటూ డంబుల్ ఇస్తుంది. దీంతో.. రవికృష్ణ ఏమాత్రం ఆలోచించకుండా నిధిని కొడతాడు. అయితే.. రవి చేతితో కొట్టడంతో.. అతనికి గాయమై తీవ్ర రక్తస్రావమవుతుంది. దీంతో.. బిగ్‌బాస్.. ఇంట్లోకి డాక్టర్‌ని పంపిస్తాడు. రవి.. చికిత్స కోసం మెడికల్ రూమ్‌కి వెళ్తాడు. దీంతో.. శ్రీముఖిపై ఒక్కసారిగా హౌస్‌మెంట్స్ అందరూ.. దుర్భాషలాడుతూ.. నిందిస్తారు. కెప్టెన్ టాస్క్‌ కోసం ఇంతలా ప్రవర్తించాలా అంటూ అరుస్తారు. మాకు ఈ నిధి వద్దు.. డబ్బు వద్దు అంటూ.. కెప్టెన్ వరుణ్.. దాన్ని తీసుకొచ్చి లివింగ్ రూమ్‌లోని టేబుల్‌పై పెడతాడు. దీంతో.. శ్రీముఖి అందరికీ.. విలన్‌లా మారుతుంది.