ఈ వారం ఎలిమినేషన్‌ కన్‌వ్యూజన్: అతనే టార్గెటా..?

ఈ వారం ఎలిమినేషన్‌ కన్‌వ్యూజన్: అతనే టార్గెటా..?

బిగ్‌బాస్.. వివాదాలకు పురుడు పోసే ప్రత్యేక గేమ్‌ షో. అందరూ సైలెంట్‌‌గా వుంటే.. ఇక బిగ్‌బాస్ షో ఎందుకు..? ఒక్కో యాంగిల్‌లో ఒక్కోక్కరిని పాయింట్‌ ఆఫ్‌ చేస్తూ.. టార్గెట్‌ ఫిక్స్ చేస్తాడు బిగ్‌బాస్. అందులో భాగంగానే.. 9వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా టాస్క్‌లు ఇచ్చాడు. ఇచ్చిన టాస్క్‌ల్లో భాగంగా.. ఈ వారం ఎలిమినేషన్‌లో.. సప్లిగంజ్ రాహుల్, మహేష్ విట్టా, హిమజ ఉన్నారు. ఈ వారంలో ఎవరు నామినేషన్‌లో బయటకు వెళ్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఈ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 21, 2019 | 2:37 PM

బిగ్‌బాస్.. వివాదాలకు పురుడు పోసే ప్రత్యేక గేమ్‌ షో. అందరూ సైలెంట్‌‌గా వుంటే.. ఇక బిగ్‌బాస్ షో ఎందుకు..? ఒక్కో యాంగిల్‌లో ఒక్కోక్కరిని పాయింట్‌ ఆఫ్‌ చేస్తూ.. టార్గెట్‌ ఫిక్స్ చేస్తాడు బిగ్‌బాస్. అందులో భాగంగానే.. 9వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా టాస్క్‌లు ఇచ్చాడు. ఇచ్చిన టాస్క్‌ల్లో భాగంగా.. ఈ వారం ఎలిమినేషన్‌లో.. సప్లిగంజ్ రాహుల్, మహేష్ విట్టా, హిమజ ఉన్నారు. ఈ వారంలో ఎవరు నామినేషన్‌లో బయటకు వెళ్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఈ ముగ్గురు ఇంటి సభ్యుల ప్రవర్తన కాస్త సపరేట్‌గానే ఉంటుంది.

మహేష్ విట్టా.. తన మాటకారి తనంతో.. ఒక వైపు సభ్యులను నవ్విస్తూనే.. మరోవైపు ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెడుతూ ఉంటాడు. ఆ విధానం వల్ల మహేష్‌కు మైనస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందులో.. మహేష్ కూడా.. నేను బయటకి వెళ్తే బావుండు అని పలు సందర్భాల్లో పేర్కొంటూ వచ్చాడు. అలాగే.. మహేష్ కూడా ఎక్కువగా ఎలిమినేషన్‌ రౌండ్లో నామినేట్ అవుతూ వచ్చాడు.

హిమజ.. ఇంటిలో ఎంట్రీ అయినప్పటి నుంచీ.. హిమజ అందరితోనూ స్నేహంగా ఉంటూ.. వచ్చింది. అలాగే.. కొన్ని కొన్ని మాటల కారణంగా.. అందరికీ శత్రువగా కూడా మారింది. ఒక్కోసారి ఒక్కోరకమైన క్యారెక్టరైజేషన్‌తో.. ఎవరికీ ఆమె ఇంకా అర్థంకాలేదు. దీంతో.. ఎక్కువగా నామినేషన్స్‌‌లో నిలుస్తోంది. అలాగే.. సేవ్ ‌అవుతూనే వచ్చింది.

రాహుల్ సప్లిగంజ్.. పున్నుతో కాస్త రొమాన్స్‌ చేస్తూ.. ఇంటిలో లవర్‌గా పాగా వేశాడు. దీంతో.. పాటుగా అతని మాట దురుసు కారణంగా.. పలు వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. అలాగే.. అతను గేమ్‌పై కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు అంతగా కనిపించడంలేదు. అందులోనూ.. మొదటి నుంచి ఎక్కువగా ఎలిమినేషన్‌లో నామినేట్ అవుతూ వచ్చాడు. మరి ఈ సారన్నా.. బయటకు వెళ్తాడో.. లేదో చూడాలి.

కాగా.. ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరు బయటకు వెళ్తారో.. అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది మహేష్, హిమజ అని అంటున్నా.. రాహుల్‌కి కూడా నెగిటివ్‌ మార్క్స్ ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ.. ఈ వారం ఈ ముగ్గురి ఎలిమినేషన్స్‌ కాస్త ఇంట్రస్టింగానే ఉంది. ఎవరు బయటికి వెళ్లినా.. ఇంటిలో కాస్త.. గొడవలు తగ్గుతాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu