AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్: అదిరిపోయే ట్విస్ట్.. అంతలోనే షాక్ 

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా తొమ్మిదవ వారాన్ని పూర్తి చేసుకునేందుకు సిద్దమైనది. ఈ వారం రాహుల్, హిమజ, మహేష్ విట్టా ఎలిమినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా ఇద్దరు సేఫ్ అయ్యి.. ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. కానీ నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఎవరా ఇద్దరూ అని […]

బిగ్ బాస్: అదిరిపోయే ట్విస్ట్.. అంతలోనే షాక్ 
Ravi Kiran
|

Updated on: Sep 23, 2019 | 12:15 PM

Share

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా తొమ్మిదవ వారాన్ని పూర్తి చేసుకునేందుకు సిద్దమైనది. ఈ వారం రాహుల్, హిమజ, మహేష్ విట్టా ఎలిమినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా ఇద్దరు సేఫ్ అయ్యి.. ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. కానీ నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఎవరా ఇద్దరూ అని అనుకునేలోపే నాగ్ ఇంకో షాక్ ఇచ్చాడు.

నాగార్జున తన చేతిలో ఉన్న ఎన్వలప్‌కవర్ తీసి ఈ వారం రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేషన్ అయ్యాడంటూ ప్రకటించగా.. హౌస్ అంతా నిశ్శబ్దం అయింది. మిగిలిన కంటెస్టెంట్లు బాధలో ఉండగా.. రాహుల్ మాత్రం జాలీగానే కనిపించాడు. అదే జోష్‌తో స్టేజ్‌పైకి వచ్చి.. ఇంటి సభ్యులకు పలు సూచనలు చేస్తూ కొద్దిసేపు ప్రేక్షకులను అలరించాడు. అంతేకాకుండా నాగార్జున రాహుల్‌తో ఓ గేమ్ ఆడించాడు. ఇంట్లో ఉన్న స‌భ్యుల‌లో రిలేష‌న్ షిప్‌, హ్యూమానిటీ, ఫ్రెండ్షిప్‌కి గాను మార్క్స్ ఇచ్చాడు. వ‌రుణ్‌కి 30కి 30 మార్కులు వేశాడు.

ఇక గేమ్ అయిపోయిన తర్వాత రాహుల్‌కి నాగ్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఇది ఫేక్ ఎలిమినేష‌న్‌. నువ్వు ఏ దారిన వచ్చావో అదే ద్వారం నుండి ఇంట్లోకి వెళ్లొచ్చు. మిగ‌తావ‌న్నీ బిగ్ బాస్ చూసుకుంటాడని చెప్పేసరికి ప్రేక్ష‌కులు నోరెళ్ల‌పెట్టారు. బిగ్ బాస్ ఇచ్చిన ఈ ఊహించని ట్విస్ట్ అభిమానులను రక్తి కట్టించిందనే చెప్పాలి. ఇది ఇలా ఉండగా రాహుల్ ఎలిమినేట్ అయ్యాడని తెలుసుకున్న తర్వాత పునర్నవి తెగ బాధపడింది. ఇకపై నేను ఎవరితో గొడవపడాలి… ఎవరిని తిట్టాలి అంటూ కన్నీరు పెట్టుకుంది.

మరోవైపు ఈ రోజు హౌస్ నుంచి హిమజ బయటికి వచ్చేస్తుందని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయం అధికారికంగా తెలియాలంటే కొద్దిగంటలు ఆగాల్సిందే.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం