బిగ్‌బాస్ విన్నర్‌‌పై.. సంచలనం రేపుతోన్న నాగార్జున ట్వీట్..!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌3 చివరి అంకానికి చేరుకుంది. మరి కొద్ది గంటల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ నేపథ్యంలో టైటిల్ విన్నర్‌ విషయంలో సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే సోషల్ మీడియాలో టైటిల్ విన్నర్ రాహుల్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అంతకుముందు టైటిల్ విన్నర్ శ్రీముఖి అంటూ.. ఏకంగా ఫోటోలే ప్రత్యక్షమయ్యాయి. ఆ తర్వాత రాహల్‌ సిప్లిగంజ్‌ గెలిచేసాడంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. అటు శ్రీముఖి అభిమానులు నిరాశకు లొనయ్యారు. ఇక […]

బిగ్‌బాస్ విన్నర్‌‌పై.. సంచలనం రేపుతోన్న నాగార్జున ట్వీట్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 03, 2019 | 1:52 PM

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌3 చివరి అంకానికి చేరుకుంది. మరి కొద్ది గంటల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ నేపథ్యంలో టైటిల్ విన్నర్‌ విషయంలో సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే సోషల్ మీడియాలో టైటిల్ విన్నర్ రాహుల్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అంతకుముందు టైటిల్ విన్నర్ శ్రీముఖి అంటూ.. ఏకంగా ఫోటోలే ప్రత్యక్షమయ్యాయి. ఆ తర్వాత రాహల్‌ సిప్లిగంజ్‌ గెలిచేసాడంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. అటు శ్రీముఖి అభిమానులు నిరాశకు లొనయ్యారు. ఇక ఈ వార్తలు సోషల్ మీడియాలో రూమర్స్‌ కావడంతో.. బిగ్‌బాస్3 కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న నాగార్జున రంగంలోకి దిగారు. ఈ రూమర్స్‌కు చెక్ పెట్టేందుకు నాగ్‌ కూడా సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. టైటిల్ విన్నర్ విషయంపై ట్వీట్ చేస్తూ.. రూమర్స్‌కు చెక్ పెట్టారు.

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్‌ అంటూ కొట్టిపారేశారు నాగార్జున. అసలు టైటిల్ విన్నర్‌ ఎవరో తాను చెప్తానని.. అది కూడా బిగ్ బాస్ లైవ్ స్ట్రీమింగ్ అంటూ సంచలనం రేపాడు. దీంతో ఒక్కసారిగా సీన్ రివర్స్‌ అయ్యింది. అయితే హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగ్‌ ఈ విషయం చెప్పడంతో.. అసలు టైటిల్ విన్నర్ ఎవరన్నదానిపై అనుమానాలు మొదలయ్యాయిప్పుడు.

అయితే ఇలాంటి లీకులు ఇవ్వడం కూడా ప్రోగ్రాం స్ట్రాటజీ అంటున్నారు చాలా మంది. టైటిల్ విన్నర్ రాహుల్ కాకుండా.. శ్రీముఖి అవుతుందా.. లేదా ఇంకెవరైనా అవుతారా అన్నది మరికాసేపట్లో తేలిపోతుంది. నాగార్జున ట్వీట్ చేయడం వెనక అసలు ట్వీస్ట్ ఏంటనేది ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.ఫైనల్ ఎపిసోడ్ ఇంకా షూట్ చేయలేదని.. అది లైవ్ జరుగుతుందని నాగ్‌ చెప్పడం సంచలనంగా మారింది.