బిగ్ బాస్ హోస్టుగా నాగార్జున హిట్టా.. ఫట్టా..?

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇది ఇలా ఉంటే ఈ సీజన్ మొత్తం నాగార్జున హోస్టింగ్‌ను గత సీజన్లతో పోలిస్తే.. రేటింగ్స్ పరంగా కాస్త వెనుకబడిందని చెప్పొచ్చు. సీజన్ స్టార్టింగ్‌లో ఎన్నో కాంట్రవర్సీలు, మరెన్నో సంచలనాలు జరగడంతో ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. అంతేకాకుండా మొదట వారం టీఆర్పీ రేటింగ్స్(17.9) రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇలాగే క్లైమాక్స్ వరకు బుల్లితెరను ఈ రియాలిటీ […]

బిగ్ బాస్ హోస్టుగా నాగార్జున హిట్టా.. ఫట్టా..?
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 03, 2019 | 2:18 AM

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇది ఇలా ఉంటే ఈ సీజన్ మొత్తం నాగార్జున హోస్టింగ్‌ను గత సీజన్లతో పోలిస్తే.. రేటింగ్స్ పరంగా కాస్త వెనుకబడిందని చెప్పొచ్చు. సీజన్ స్టార్టింగ్‌లో ఎన్నో కాంట్రవర్సీలు, మరెన్నో సంచలనాలు జరగడంతో ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. అంతేకాకుండా మొదట వారం టీఆర్పీ రేటింగ్స్(17.9) రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇలాగే క్లైమాక్స్ వరకు బుల్లితెరను ఈ రియాలిటీ షో ఏలుతుందని నిర్వాహకులు భావించగా.. అది కాస్తా రివర్స్ అయింది.

అక్కినేని నాగార్జున తనదైన శైలి యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. షో టీఆర్పీ ప్రకారం కనీసం స్టార్ మాలో ప్రసారమయ్యే ‘కార్తీకదీపం’ లాంటి సీరియల్‌ను కూడా బిగ్ బాస్ దాటాకపోవడం గమనార్హం. ఎక్కడా కూడా కంటెస్టెంట్ల మధ్య సరైన పోటీ లేకపోవడం.. ఒక్క అలీ రెజా తప్పితే మిగిలిన వారెవరు టాస్కుల్లో సరిగ్గా పెరఫార్మ్ చేయకపోవడం వంటివి మైనసులు అని చెప్పొచ్చు. అంతేకాకుండా సస్పెన్స్ అనేది లేకుండా ప్రతీ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఒక్క రోజు ముందుగానే సోషల్ మీడియాలో తెలిసిపోవడం వల్ల షో పట్ల ఫ్యాన్స్‌కు ఆసక్తి తగ్గిపోయింది. ఈ సీజన్‌లో ఏ కంటెస్టెంట్ అంతలా ప్రేక్షకుల్లో ఇంపాక్ట్ చూపలేకపోయాడని చెప్పాలి.

ఇదిలా ఉంటే గత రెండు సీజన్లకు.. ఇందుకు భిన్నంగా టీఆర్పీ రేటింగ్స్ నమోదు చేశాయి. మొదటి సీజన్‌లో ఎన్టీఆర్ తనదైన యాంకరింగ్‌తో రక్తి కట్టించడమే కాదు.. టీఆర్పీ పరంగా కొత్త రికార్డులను కూడా క్రియేట్ చేశాడు. అంతేకాకుండా శివ బాలాజీ, హరిప్రియ, నవదీప్,ధన్‌రాజ్, సంపూర్ణేష్ బాబు, ముమైత్ ఖాన్, సింగర్ మధుప్రియ,సమీర్, అర్చన,ప్రిన్స్,ఆదర్శ్ వంటి కంటెస్టెంట్లు హౌస్‌లో ఉండటంతో ఆ సీజన్ మంచి రసవత్తరంగా సాగింది.

ఇక ఆ తర్వాత నాని హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2 ‘కౌశల్ ఆర్మీ’ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుందనే చెప్పాలి. షో స్టార్ట్ అయిన మూడో వారం నుంచి మిగతా ఇంటి సభ్యులు కౌశల్‌ను టార్గెట్ చేయడంతో ‘కౌశల్ ఆర్మీ’ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చింది. మరోవైపు హోస్ట్ నానికి కూడా కొన్ని విమర్శలు ఎదురైన మాట వాస్తవమే. ఇంకా చెప్పాలంటే నాని కంటే కౌశల్‌కే ఈ సీజన్‌లో ఎక్కువ పేరు వచ్చింది. అయితే టీఆర్పీ విషయంలో మాత్రం కాస్త మందగించిందని చెప్పాలి.