Big News Big Debate: మునుగోడులో ప్రతి గ్రామంలో తనిఖీలు.. ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్
తెలంగాణ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేనంత హైటెన్షన్ రేపుతోంది మునుగోడు బైపోల్. పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం పీక్స్‌కు చేరి మరీ ముగిసింది. భారీగా ధన ప్రవాహం కొనసాగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేనంత హైటెన్షన్ రేపుతోంది మునుగోడు బైపోల్. పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం పీక్స్‌కు చేరి మరీ ముగిసింది. భారీగా ధన ప్రవాహం కొనసాగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. మద్యం ఏరులై పారుతోందని.. వందల కోట్ల అమ్మకాలు సాగాయంటున్నారు. ఇక నాన్ వెజ్ అమ్మకాలు కూడా సరికొత్త రికార్డు సృష్టించినట్టు చెబుతున్నారు. ఒక్క నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో దాదాపు 8 కోట్లకు పైగా నగదు సీజ్ చేయడం సాధారణ విషయం కాదు. ఇక పలివెలలో జరిగిన ఘటన ఒక్కసారిగా స్థానికుల్లో భయాందోళనలకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అదనపు బలగాలతో ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం.
మునుగోడులో ప్రతి గ్రామంలో తనిఖీలు చేస్తున్నామని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ చెబుతున్నారు. కల్యాణ మండపాలతో సహా అన్నింటినీ చెక్ చేస్తున్నామని.. పోలింగ్ సామగ్రి పంపిణీ సజావుగా సాగుతోందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను వీడియో ద్వారా లైవ్‌లో పర్యవేక్షిస్తున్నామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్.. బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో ఇంకా ఏం మాట్లాడారో ఈ కింద ఇచ్చిన వీడియోలో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..