Big News Big Debate: హుజురాబాద్ ప్రిమియర్ లీగ్‌లో గెలుపు ఎవరిది..?
తనపై పోటీచేసి గెలవాలని కేసీఆర్, హరీష్‌రావుకు ఈటల రాజేందర్ ఇటీవల సవాల్ విసిరారు. నీకంత సీను లేదు మా యువనాయకుడిపై...
తనపై పోటీచేసి గెలవాలని కేసీఆర్, హరీష్‌రావుకు ఈటల రాజేందర్ ఇటీవల సవాల్ విసిరారు. నీకంత సీను లేదు మా యువనాయకుడిపై ముందు గెలువు చూద్దామంటూ TRS సమాధానం చెబుతూ విద్యార్ది నాయకుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు హుజూరాబాద్ టికెట్ కన్ఫామ్ చేశారు KCR. పథకాలు.. రాజకీయ చేరికలు అన్ని ముగించి అభ్యర్ధిని కూడా ప్రకటించి కదనరంగంలోకి దిగింది గులాబీ. హరీష్ ఎంట్రీతో అక్కడ అసలైన ఫైట్ కూడా మొదలైంది. పాదయాత్రను అనారోగ్యంతో మధ్యలోనే ఆపేసిన ఈటల రాజేందర్ మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు. అటు BC కార్డు.. ఇటు ఉద్యమ నేపథ్యం ఇద్దరిదీ ఒకటే మంత్రం.
గెల్లుకు దక్కిన సీటు.. బీసీ నేపథ్యం
TRS అభ్యర్థి ఎవరో తేలిపోయింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్.. హుజూరాబాద్‌లో గులాబీ దళం నుంచి బరిలో దిగుతున్న అభ్యర్థి. ముందు నుంచి అనుకున్నట్లే ఆయనకే టికెట్ కన్ఫాం చేశారు CM కేసీఆర్. స్థానిక నేత కావడం, ఉద్యమంలో పని చేయడంతో శ్రీనివాస్‌కు కలిసివచ్చిన అంశాలు. ఆస్తులు లేవు. అవినీతి ఆరోపణలు లేకపోవడంతో మిస్టర్‌క్లీన్ ఇమేజ్ తో ఉన్న తనకు కేసీఆర్ ఇచ్చిన అవకాశం అంటున్నారు గెల్లు. ఈటల హఫ్ బీసీ అంటూ విమర్శలు గుప్పిస్తున్న గులాబీ దళం.. తాజాగా హరీష్ కూడా నిఖార్సైన బీసీని రంగంలో దింపామంటున్నారు. నియోజకవర్గంలో లక్షకు పైగా ఉన్న BCఓట్లే లక్ష్యంగా TRS వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పైగా యాదవ సామాజికవర్గానికి అక్కడ సుమారు 22వేల ఓట్లున్నాయి.
ఉద్యమ నేపథ్యం.. యంగ్ బ్లడ్
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అటు బీసీ… మరోవైపు ఉద్యమ నేపథ్యం. యూత్.. ఇవన్నీ కూడా గెల్లు శ్రీనివాసయాదవ్‌కు అనుకూలంగా మారాయి. ఈటెలకు సరైన పోటీ అని కూడా భావిస్తోంది అధికార పార్టీ. ఉద్యమకారులకు ద్రోహం చేసిందన్న ఈటల రాజేందర్ తరచుగా చేస్తున్న విమర్శలకు సమాధానంగా గెల్లును రంగంలో దింపారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు. పైగా ఉద్యమంలో జైలుకు వెళ్లొచ్చాడు. అంతేకాదు.. ఉన్నతవిద్యావంతుడు, కేసీఆర్ కుటుంబానికి మొదటి నంచి లాయలిస్టుగా ఉన్నాడు. దీంతో పాటు ఇక దుబ్బాకలో యువత బీజేపీ వైపు మొగ్గు చూపారు. అక్కడ ఓటమిలో యూత్ మైగ్రేషన్ కారణం. దీనిని దృష్టిలో పెట్టుకుని హుజూరాబాద్లో అలాంటి తప్పిదం జరగకుండా జాగ్రత్తపడింది. క్లీన్ ఇమేజ్ ఉన్న యంగ్ బ్లడ్‌గా గుర్తించి గెల్లుకు ఛాన్స్ ఇచ్చారంటున్నాయి TRS శ్రేణులు.
గెల్లు ఎంపిక ఈటలకు సవాలే..
మొత్తానికి అందరికంటే ముందే అధికారపార్టీ అభ్యర్ధిని రంగంలో దింపింది. కానీ ప్రచారంలో ముందున్న బీజేపీ నుంచి ఈటలను ఇంకా ఖరారు చేయలేదు. ఓ రకంగా ఈటలకు ఇదో సవాలే. పోటీలో ఆయనే ఉండి గెలిస్తే ప్రిస్టేజ్ పెరుగుతుంది. కానీ ఓడితే విద్యార్థి నాయకుడి చేతిలో ఓడారన్న విమర్శ తప్పదు. భార్య జమున పేరు తెరమీదకు వస్తున్నా.. సామాజిక వర్గం మైనస్ అంటున్నారు విశ్లేషకులు. KCR వేసిన పాచికతో ప్రత్యర్ధులు మల్లగుల్లాలు పడుతున్నారు. పథకాలతోనే కాదు.. పొలిటికల్ వ్యూహాలతో కూడా ప్రత్యర్ధులను ఇరుకున పెడుతున్నారు కేసీఆర్. ట్రబుల్ షూటర్ హరీష్‌రావు హుజూరాబాద్‌లో ఎంట్రీతోనే ఈటలపై విమర్శల స్వరం పెంచారు. మొత్తానికి హుజూరాబాద్ ప్రీమియర్ లీగ్‌లో గెలిచేదెవరు? టైటిల్ సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టేదెవరు? మాటల యుద్ధం..
ఈటలపై TRS ఎక్కుపెట్టిన అస్త్రాలు
*రాజకీయంగా ముప్పేట దాడి. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ, భారీగా వలసలు *ఈటల బీసీ కాదు హాఫ్ బీసీ, గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిఖార్సైన బీసీ *200 ఎకరాల అసామి Vs 2 గుంటల భూమి ఉన్న నిరుపేద మధ్య పోటీ *సామాన్య ఉద్యమకారుడు Vs కేసీఆర్‌ను గుండెలపై తన్నిపోయిన నాయకుడు మధ్య పోటీ *అధికారం ఉన్నా అభివృద్ధి చేయలేదు —————————
టీఆర్‌ఎస్‌పై ఈటల ఎక్కుపెట్టిన అస్త్రాలు
*బీసీలకు, అణగారిన వర్గాలకు TRSలో చోటు లేదు *పార్టీలో తనకు తీరని అన్యాయం జరిగిందంటూ సానుభూతి *ఒక్కడిపై అందరూ కలిసి ముప్పేట దాడి చేస్తున్నారు *అధికార దుర్వినియోగంతో ఓడించాలని విశ్వప్రయత్నాలు *హత్యకు కూడా కుట్ర జరిగింది.. ఓ మంత్రి హస్తం ఉంది ———– బీజేపీ, టీఆర్‌ఎస్ అభ్యర్థుల బలాలు.. బలహీనతలు
హుజూరాబాద్ ఎన్నికలు.. ఉద్యమం, బీసీ కార్డు అస్త్రాలుగా జరుగుతున్న ఫైటింగ్‌పై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ స్పెషల్ చర్చ చేపట్టారు.. ఫుల్ వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేయండి.