Guava Leaf Tea Benefits: షుగర్ వ్యాధి ఉన్నవారికి జామ ఆకుల టీ ఎంత మంచిదో తెలుసా..!
పేదవాడి యాపిల్ గా పిలుచుకొనే జామకాయ తింటే ఎన్నో ఉపయోగాలున్నాయి. అంతే స్థాయిలో జామ ఆకులు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను ఈ జామ ఆకుతో నివారించుకోవచ్చు..

Guava Leaf Tea Benefits: ప్రకృతి లో మానవుడు కూడా ఓ భాగమే.. మనిషికి ప్రకృతికి విడదీయరాని బంధం ఉన్నది.. అందుకనే మనిషికి ఉపయోగపడే విధంగా మొక్కలు, జంతువులు ఎన్నో జన్మించాయి. మన ఆరోగ్యానికి మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక పేదవాడి యాపిల్ గా పిలుచుకొనే జామకాయ తింటే ఎన్నో ఉపయోగాలున్నాయి. అంతే స్థాయిలో జామ ఆకులు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను ఈ జామ ఆకుతో నివారించుకోవచ్చు..
జామ ఆకులతో టీ తయారు చేసుకొని తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయి. జామాకులను శుభ్రంగా కడిగి.. నీటిలో వేసి మరిగిస్తే టీ తయారు అవుతుంది.. ఈ టీ ని రోజులో కొద్దిగా కొద్దిగా తాగుతుంటే అనేక ప్రయోజనాలున్నాయి.
జామాకుల వల్ల కలిగే ప్రయోజనాలు…
*జామ ఆకులను శుభ్రంగా కడిగి నమలితే పంటి నొప్పి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.. *చివుర్లు నొప్పి ఉన్నా.. నోట్లో పూత ఉన్నా జామ ఆకులు నమిలితే సమస్య నుంచి నివారణ లభిస్తుంది. *రక్తం లో ఉన్న గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. *అధిక కొవ్వు ఉన్న వారు ఈ టీ తాగితే మంచిది *పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు పొట్ట నొప్పితో బాధపడతారు. ఈ నొప్పిని జామ ఆకుల రసం ఈ నొప్పులను అదుపుచేస్తుంది. రోజూ ఈ రసం తీసుకుంటే మేలు జరుగుతుంది. * అజీర్ణ సమస్యలనుంచి ఆస్తమా నుంచి ఈ టీ ద్వారా విముక్తి లభిస్తుంది. *ఈ ఆకుల్లో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి2 కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. బి3, బి5, బి6 విటమిన్స్ చర్మ సౌందర్యానికి చాలా మంచివి. ఈ జామ ఆకుల టీ పై జపాన్ లోని “యాకుల్ట్ సెంట్రల్ ఇనిస్ట్యూట్” వారు పరిశోధన జరిపారు. ఈ పరిశోధనలో జామ ఆకుల నుంచి తయారు చేసిన టీ మధుమేహ వ్యాధి గ్రస్థులు తాగడం వల్ల వారి శరీరంలో “ఆల్ఫా గ్లూకోసైడేజ్” ఎంజైమ్ చైతన్యత తగ్గుతుంది అని.. అందుకని రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది అని తెలిసింది. అంతేకాదు.. శరీరంలో ఉండే సుక్రోజ్ మరియు మాల్టోజ్ గ్రహించడాన్ని తగ్గించి వేస్తుందీ జామ టీ అందుకని రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అయితే ఈ జామ ఆకు టీ ని కనీసం 12 వారాలు తీసుకోవాల్సి ఉందని.. అలా చేస్తే.. ఇన్సులిన్ ఉత్పత్తి అధికం కాకుండా.. శరీర రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఈ పరిశోధనల ఫలితంగా తెలిసింది అని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
Also Read: ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడే.. తెలుగు భాష లెక్క.. బుల్లితెరపై ఉంటా.. వెండితెరపై ఉంటానన్న ప్రదీప్