Arvind Kejriwal: కేజ్రీవాల్ రైజింగ్ అండ్ ఫాల్.. మళ్లీ పూర్వ వైభవం సాధ్యమేనా?
ఆనతికాలంలోనే అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడి హోదా నుంచి సీఎం స్థాయికి ఎదిగారు అర్వింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో అద:పాతాళానికి పడిపోయారు. గతంలో ఆయనతో కలిసి ఆప్‌లో కీలకంగా పనిచేసిన నాయకులు కూడా ఇప్పుడు ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు. ఆప్ పతనానికి ఆయనే కారణమంటూ కేజ్రీవాల్ వైపు వేలు చూపిస్తున్నారు. మరి కేజ్రీవాల్ రైజింగ్, ఫాల్‌కు కారణాలు ఏంటి? ఆయన ముందున్న సవాళ్లు ఏంటి? ఇప్పుడు చూద్దాం.
- Rajinikanth Vellalacheruvu
- Updated on: Feb 10, 2025
- 8:12 pm
వైవిధ్య భారతంలో ”కోడ్” కూసేనా..! UCC అమలుకు అడ్డంకులేంటి..?
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది. యూసీసీ అమలులోకి రావడంతో రాష్ట్ర పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్‌సింగ్ ధామి తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి ఏ మతానికి, వర్గానికి వ్యతిరేకం కాదన్న ఆయన.. మహిళా సాధికారతకు ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మరి.. భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలకు నిలయమైన భారతావనిలో అన్ని రాష్ట్రాల్లో యూసీసీ అమలు సాధ్యమేనా.? దీన్ని అమలు చేయాలంటే ఎదురయ్యే అడ్డంకులు ఏంటి..? దీని టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ వెల్లలచెరువు వ్యూపాయింట్ ఇదిగో..
- Rajinikanth Vellalacheruvu
- Updated on: Jan 29, 2025
- 3:49 pm