AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: మీ డేట్ ఆఫ్ బర్త్ 6, 15, 24 అయితే బంపర్ ఆఫర్..! శుక్రుడి పవర్స్‌ తో మీ లైఫ్ సెట్..!

సంఖ్యాశాస్త్రం ప్రకారం.. ప్రతి అంకెకు ఓ ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మూలసంఖ్య 6కి శుక్రుడు అధిపతి. ప్రేమ, డబ్బు, కళలు వంటివి శుక్రుడి లక్షణాలు. అందుకే నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినవాళ్ల జీవితం శుక్ర దేవుడి అనుగ్రహంతో సుఖసమృద్ధిగా సాగుతుందని నమ్ముతారు.

Numerology: మీ డేట్ ఆఫ్ బర్త్ 6, 15, 24 అయితే బంపర్ ఆఫర్..! శుక్రుడి పవర్స్‌ తో మీ లైఫ్ సెట్..!
Luckiest Numbers
Prashanthi V
|

Updated on: Jul 13, 2025 | 6:03 PM

Share

సంఖ్యాశాస్త్రం మన జీవితంలో అదృష్టాన్ని చెప్పే ఒక ఆసక్తికరమైన శాస్త్రం. ఇందులో 1 నుండి 9 వరకున్న సంఖ్యలు ముఖ్యమైనవి. ప్రతీ సంఖ్యకు ఒక గ్రహం లింక్ అయి ఉంటుంది. ఈసారి మనం శుక్రుడికి సంబంధించిన ఒక అద్భుతమైన సంఖ్య గురించి తెలుసుకుందాం. ఈ సంఖ్యలో పుట్టిన వాళ్ళపై శుక్ర దేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందట. లక్ష్మీదేవి కరుణ కూడా వీళ్ళకు పుష్కలంగా లభిస్తుందని నమ్మకం.

మీ మూలసంఖ్యను తెలుసుకోండిలా..

మీరు ఏ నెలలో ఏ తేదీన పుట్టారో ఆ తేదీలోని అంకెలన్నీ కలిపితే మీ మూలసంఖ్య వస్తుంది. ఉదాహరణకు మీరు నెలలో 24వ తేదీన పుట్టారనుకోండి 2 + 4 = 6. అంటే మీ మూలసంఖ్య 6 అవుతుంది. ఇలా ప్రతీ ఒక్కరూ తమ పుట్టిన తేదీ అంకెలతో తమ మూలసంఖ్యను ఈజీగా తెలుసుకోవచ్చు.

శుక్రుడి ప్రభావం చూపే మూలసంఖ్య 6

సంఖ్యాశాస్త్రం ప్రకారం.. నెలలో 6, 15, లేదా 24వ తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 6 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శుక్ర గ్రహం. శుక్రుడు అంటేనే ధనం, అందం, ప్రేమ, కళలు వీటన్నింటికీ ప్రతీక. అందుకే ఈ సంఖ్యలో పుట్టినవాళ్ళలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఈ సంఖ్య ఉన్నవాళ్ళ ప్రత్యేకతలు

శుక్రుడి దయతో మూలసంఖ్య 6 ఉన్న వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా, మృదువైన స్వభావంతో ఉంటారు. వీళ్ళు ఎవరినైనా సులువుగా ఆకట్టుకోగలరు. ప్రేమ విషయంలో వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. తమ జీవిత భాగస్వామి పట్ల ఎంతో అంకితభావంతో వ్యవహరిస్తారు.

అంతేకాకుండా వీళ్ళలో కళాత్మకత ఎక్కువగా ఉంటుంది. అందుకే సృజనాత్మక రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. వీళ్ళకు డబ్బు విషయంలో పెద్దగా ఇబ్బందులు రావు. శుక్రుడు సంపదను ఇచ్చే గ్రహం కాబట్టి.. వీళ్ళ జీవితం చాలా సౌకర్యవంతంగా సాగుతుంది.

లక్ష్మీదేవి అనుగ్రహం

ఈ మూలసంఖ్య వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. ఇది వీళ్ళకు భౌతిక సుఖాలు, శ్రేయస్సును అందిస్తుంది. శుక్రవారం రోజున తెలుపు రంగు వస్తువులు.. పాలు, బియ్యం, కౌడి లేదా ఖీర్ లాంటివి దానం చేస్తే అదృష్టం మరింత పెరుగుతుంది. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు.. అమ్మవారికి తామర పువ్వులు, కౌడి, శ్రీఫలం లాంటి పవిత్ర వస్తువులను సమర్పించడం మంచిది. దీని వల్ల అమ్మవారి దయ లభించి జీవితం మరింత శుభప్రదంగా మారుతుంది.