Weekly Horoscope: ఆగస్టు 8 నుంచి 14 వరకు వార ఫలాలు.. ఈ రాశుల వారికి ఉద్యోగ అవకాశాలు.. అధిక లాభాలు

Weekly Horoscope: మనం పలు సందర్భాల్లో ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే చాలా..

Weekly Horoscope: ఆగస్టు 8 నుంచి 14 వరకు వార ఫలాలు.. ఈ రాశుల వారికి ఉద్యోగ అవకాశాలు.. అధిక లాభాలు
Follow us
Subhash Goud

|

Updated on: Aug 08, 2021 | 6:33 AM

Weekly Horoscope: మనం పలు సందర్భాల్లో ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే చాలా మంది రోజును ప్రారంభించే ముందు తమ తమ రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటుంటారు. భారత దేశంలో రాశిఫలాలను విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆగస్టు 8 నుంచి 14 వరకు  వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో చూద్దాం.

మేషం:

ఈ రాశివారికి ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడతాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వివిధ పనులు చేపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

వృషభం:

ఈ వారం చాలావరకు పనులలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రుల సహాలు, సూచనలు అందుకుంటారు. చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయాల్లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. ఉద్యోగులకు ఒత్తిడిలు తప్పవు. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అవనసరమైన విషయాలలో తలదూర్చడం మంచిది కాదు.

మిథునం:

ఈ రాశివారు కొత్త వ్యాపారాలు చేపట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి ముందుకెళ్లడం మంచిది. కొన్ని పనులు సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు, వృత్తి నిపుణులు చక్కని పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం:

ఈ రాశివారికి సమాజంలో మంచి పలుకుబడి ఏర్పడుతుంది. బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు వీలైనంతగా సహాయపడతారు. సామాజిక హోదా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం విషయంలో ఆదాయాలు, లాభాలు నిలకడగా ఉంటాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి తప్పవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

సింహం:

ఈ రాశివారికి చేపట్టే పనులలో అనుకూలంగా ఉంటాయి. లాభాలు గడిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కే ప్రయత్నాలు చేస్తారు. ఆశించిన స్థాయిలో పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రుల, సహకారాలు అందుకుంటారు. ఒక వ్యక్తిగత సమస్యను స్నేహితుల సహాయంతో పరిష్కరించుకుంటారు. ఆర్థిక రంగాలవారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

కన్య:

వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరమైన వ్యక్తులతో దూరంగా ఉండటం మంచిది. వృత్తి నిపుణులు, ముఖ్యంగా డాక్టర్లకు, లాయర్లకు శ్రమ పెరుగుతుందే తప్ప ఆదాయం పెరగదు. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల :

ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబం సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొందరితో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. సంతాన యోగానికి వకాశం ఉంది. కొందరు డబ్బుల పరంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ వారం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

వృశ్చికం:

నిరుద్యో్గులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రశాంతత లభిస్తుంది. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వ్యాపార రంగాలలో మంచి లాభాలు ఉంటాయి. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబంలో పెండింగ్‌లో ఉన్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది.

ధనస్సు:

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి పనులను చేపట్టే ప్రయత్నం చేస్తారు.

మకరం:

ఈ రాశివారికి ఆదాయం మరింతగా మెరుగు పడుతుంది. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని సందర్భాలలో మానసిక ఒత్తిడిలు తప్పవు. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపార విషయాలలో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

కుంభం:

ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కొత్త కొత్త పనులు చేపట్టే అవకాశం ఉంది. కుంటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వివాహ సంబంధాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.

మీనం:

ఈ రాశివారు పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు మంచి గుర్తింపు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం అధికంగా కష్టపడతారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. దూర ప్రాంతంలోని సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.