Zodiac Signs: సింహరాశిలో చంద్రుడి సంచారం..ఆ నాలుగు రాశుల వారికి అదృష్ట యోగం..

| Edited By: Janardhan Veluru

May 27, 2023 | 3:38 PM

మనఃకారకుడైన చంద్రుడు ప్రస్తుతం సింహ రాశిలో సంచరిస్తున్నాడు. రవి అధిపతి అయిన సింహరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల సాధారణంగా హోదా పెరగటం, మంచి కార్యాలు జరగటం, తల్లి ప్రేమను పొందగలటం, తల్లి ఆరోగ్యం బాగుపడటం వంటివి జరుగుతాయి.

Zodiac Signs: సింహరాశిలో చంద్రుడి సంచారం..ఆ నాలుగు రాశుల వారికి అదృష్ట యోగం..
Zodiac Signs
Follow us on

మనఃకారకుడైన చంద్రుడు ప్రస్తుతం సింహ రాశిలో సంచరిస్తున్నాడు. రవి అధిపతి అయిన సింహరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల సాధారణంగా హోదా పెరగటం, మంచి కార్యాలు జరగటం, తల్లి ప్రేమను పొందగలటం, తల్లి ఆరోగ్యం బాగుపడటం వంటివి జరుగుతాయి. అయితే చంద్రుడి సింహరాశి సంచారం నాలుగు రాశులకు మాత్రమే ప్రస్తుతానికి బాగా అను కూలంగా ఉంది. మేషం, కర్కాటకం, తుల, ధను రాశి వారికి సింహరాశి చంద్రుడు కొన్ని రకాల యోగాలను పట్టించబోతున్నాడు.

  1. మేష రాశి: ఈ రాశి వారికి ఐదవ స్థానంలో చంద్ర సంచారం వల్ల అటు ఉద్యోగంలోనూ ఇటు సామాజికం గానూ గౌరవ మర్యాదలు పెరగటం, మాట చెల్లుబాటు కావడం, సలహాలు సూచనలకు విలువ పెరగటం, సంతానానికి సంబంధించి శుభవార్తలు వినడం వంటివి తప్పనిసరిగా జరుగుతాయి. ముఖ్యంగా ప్రాజెక్టులు లేదా ప్రణాళికలు తయారు చేసే రంగంలో ఉన్నవారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. చంద్రుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఎక్కువగా పాజిటివ్ గా ఆలోచించడం మంచిది. ఏ చిన్న ఆలోచన లేదా ప్రయత్నం చేసినప్పటికీ అది తప్పకుండా సఫలం అవుతుంది. నెగిటివ్ గా ఆలోచించడం మంచిది కాదు. క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి కూడా ఇది చాలా మంచి సమయం.
  2. కర్కాటక రాశి: ఈ రాశి వారికి బంధుమిత్రులలో పలుకుబడి బాగా పెరుగుతుంది. ఇరుగుపొరుగు వారిలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఆర్థిక ప్రయ త్నాలు విజయవంతం అవుతాయి. కుటుం బంలో సామరస్యం, ప్రశాంత వాతావరణం నెల కొంటాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో మెరుగు దల కనిపిస్తుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. వాగ్దానాలు చేసినా, హామీలు ఉన్నా అవి తప్పకుండా నెరవేర్చడం సాధ్యమవుతుంది. పిల్లలకు లేదా కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులలో ఒకరు ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది.
  3. తులా రాశి: ఈ రాశి వారికి లాభ స్థానంలో చంద్రుడి సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపిస్తుంది. తప్పకుండా ఆదాయపరంగా అభివృద్ధి ఉంటుంది. అధికారు లతో సత్సంబంధాలు, ప్రముఖులతో పరిచ యాలు ఏర్పడతాయి. కుటుంబంలోని పెద్దవారి నుంచి ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే అంతగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వినడం జరుగుతుంది.
  4. ధనుస్సు రాశి: ఈ రాశి వారికి భాగ్య స్థానంలో చంద్రుడి సంచారం వల్ల తల్లికి దగ్గర కావడం, తల్లి ప్రేమ పొందడం, తల్లి వల్ల ఆర్థికంగా ప్రయోజనం కలగటం, తల్లి ఆరోగ్యం మెరుగుపడటం, విదేశాలలో ఉద్యోగానికి లేదా విదేశీ యానానికి సంబంధించి శుభవార్తలు వినడం వంటివి జరుగుతాయి. సాధారణంగా భాగ్య స్థానంలో చంద్రుడి సంచారం వల్ల ఇతరులకు మేలు జరిగే పనులు చేయడం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వితరణ కార్యక్రమాలు చేపట్టడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఔదార్యం ఎక్కువ కావడం సహాయం చేయాలనే తపన పెరగటం వంటివి కూడా జరుగుతాయి.
  5. ఇతర రాశులకు జాగ్రత్తలు: మిగిలిన రాశులకు చంద్రుడి సింహరాశి సంచారం అంతగా అనుకూలంగా లేనందువల్ల కొన్ని చెడు ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగించడం, తల్లి వైపు బంధువుల వల్ల ఆర్థికంగా నష్టం జరగటం, మానసికంగా చికాకులు తలెత్తడం, సన్నిహితులతో కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అందువల్ల ఇతర రాశుల వారు లలితా సహస్రనామం లేదా దుర్గా స్తోత్రం వంటివి పారాయణ చేయడం చాలా మంచిది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఇవి కూడా చదవండి

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..