Horoscope Today: ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త, అన్నింటా విజయాలే.. సోమవారం రాశిఫలాలు ఇలా
Horoscope Today: ఉద్యోగంలో అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. ప్రోత్సాహకాలు, ప్రతిఫలం లభించే అవకాశం ఉన్నప్పటికీ, విశ్రాంతి కరువవుతుంది. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కారం కావచ్చు.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో లక్ష్యాలను, బాధ్యతలను పూర్తి చేసే విషయంలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆలయాల సందర్శన ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశం ఉంది. అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్ప గిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఒక ముఖ్యమైన ఆస్తి వివాదం నుంచి బయట పడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులకు ఆర్థిక సహాయం అంది స్తారు. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగం మారేందుకు అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆదా యం బాగా వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు మార్గాల్లో ధన లాభాలు కలుగుతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ది చెందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృ ప్తికరంగా ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆదాయానికి లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలు గుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. చేపట్టిన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో బాధ్యతలు పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో శుభ కార్యంలో పాల్గొం టారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. రావలసిన డబ్బును పట్టుదలగా రాబట్టుకుం టారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురు తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపో తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరు అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఆరోగ్యం, ఆదాయం నిలకడగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపా రాలు సాఫీగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. వ్యక్తి గత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం మారడానికి సమయం బాగా అను కూలంగా ఉంది. నిరుద్యోగులు మంచి ఆఫర్ అందుకుంటారు. అనుకోకుండా పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం నిలకడగా సాగిపోతుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా పురోగమిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిల కడగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తలపెట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. గృహ, వాహన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
మకరం (ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యుల తీరుతెన్నులు ఇబ్బందులు కలిగిస్తాయి. బంధుమిత్రులకు అవసర సమయంలో బాగా సహాయపడతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. ప్రోత్సాహకాలు, ప్రతిఫలం లభించే అవకాశం ఉన్నప్పటికీ, విశ్రాంతి కరువవుతుంది. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కారం కావచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆశించిన శుభ వార్త వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగు తాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం శ్రేయస్కరం. కొద్ధి శ్రమతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. దగ్గర బంధువులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. కుటుంబపరంగా కూడా ఒకటి రెండు చికాకులు తప్పకపోవచ్చు. ఆరోగ్యం పరవాలేదు. నిరుద్యోగులకు శుభ వార్తలు అందు తాయి.



