Zodiac Signs
గ్రహరాజు అయినటువంటి రవి గ్రహం తన ఉచ్ఛ రాశి అయిన మేషంలో సంచరిస్తున్నాడు. ఆరోగ్యానికి, అధికారానికి కారకుడైన రవి తన ఉచ్ఛ స్థానంలో మే నెల 16 వరకు ఉంటాడు. దాదాపు అన్ని రాశుల వారికి ఆరోగ్యపరంగా, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా ఏదో ఒక విధమైన మేలు జరిగేలా చూస్తాడు. పైగా తనకు ప్రాణ స్నేహితుడైన గురువుతో కలవడం వల్ల రవికి సంబంధించిన శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. ఒక మూడు వారాలపాటు రవి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా మేలు చేస్తాడన్నది ఇక్కడ పరిశీలిద్దాం.
మేష రాశి
ఈ రాశిలో ఉచ్ఛ పట్టిన రవి వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా అధికారం చేతికి అంది వచ్చే అవకాశం ఉంది. అధికారుల నుంచి లేదా యజమానుల నుంచి ఆదరాభిమానాలు పెరుగుతాయి. లక్ష్యాలను సాధించడంలో సహాయ సహకారాలు లభిస్తాయి. కోరుకున్న ప్రాంతానికి ప్రమోషన్ మీద బదిలీ అయ్యే అవకాశం ఉంది. వివిధ వృత్తుల వారికి, వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
వృషభ రాశి
ఈ రాశి వారికి రవి వ్యయ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ, ఉద్యోగ జీవితం, వృత్తి జీవితం సాఫీగా సాగిపోవడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక రంగం, ప్రభుత్వం, న్యాయం, పోలీస్ వంటి రంగాలకు చెందిన వారికి జీవితం మూడు పూవులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితంలో అధికారుల అండదండలు లభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ చేతికి దక్కే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా, ఆదాయ పరంగా సమయం అనుకూలంగా ఉంటుంది. విలాస జీవితం అలవడుతుంది. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది.
మిథున రాశి
ఈ రాశి వారికి లాభ స్థానంలో రవి ఉచ్ఛ పట్టడం వల్ల ఆదాయం ఆశించిన దాని కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచ నలు ఉన్నాయి. గృహ వాహన సౌఖ్యాలు అను భవానికి వస్తాయి. ప్రతి ప్రయత్నం విజయవం తంగా పూర్తి అవుతుంది. శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుం టాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికారం అనుభవించడం జరుగుతుంది. తోబుట్టువులతో విభేదాలు వివాదాలు పరిష్కారమై సఖ్యత పెరుగుతుంది. శరీర దారుఢ్యం పెరుగుతుంది. ఈ రాశి వారు ప్రస్తుతం ఎంత పాజిటివ్ గా వ్యవహరిస్తే అంతగా శుభ ఫలితాలను అనుభవిస్తారు.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి దశమంలో రవి సంచారం వల్ల ఉద్యోగంలో తప్పనిసరిగా శుభయోగాలు పట్టబోతున్నాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలోనే కాకుండా సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగు తాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పు చోటు చేసుకుంటుంది. ఉద్యోగం మారాలనుకుంటున్న వారికి ఇది ఎంతో అనుకూల సమయం. రాజకీయ నాయకులకు పట్ట పగ్గాలు ఉండవు. గృహ వాహన సౌఖ్యాలకు అవకాశం ఉంది. ఇల్లు లేదా స్థలం కొనాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం అన్ని విధాలుగాను అనుకూలిస్తుంది.
సింహ రాశి
ఈ రాశి వారికి రాశి అధిపతి అయిన రవి ఉచ్ఛ పట్టడం వల్ల ఈ రాశి వారు ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. సొంతగా వ్యాపారం ప్రారంభిం చినా, స్వయం ఉపాధిని చేపట్టినా తప్పకుండా అభివృద్ధి చెందే సూచనలు ఉన్నాయి. ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. వీసా సమస్యలు ఏవైనా ఉంటే అవి అతి త్వరగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పలుకుబడి పెరుగుతుంది. సన్మానాలు, సత్కారాలకు అవకాశం ఉంది.
కన్యా రాశి
ఈ రాశి వారికి అష్టమ స్థానంలో రవి సంచారం వల్ల ఎటువంటి అనారోగ్యం నుంచైనా కోలుకోవ డానికి అవకాశం ఉంది. ఈ రాశి వారి ఆరోగ్యంతో పాటు జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా ఎంత గానో మెరుగు అవుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ జీవితం ఇటువంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామి తరఫునుంచి ఆస్తి లేదా సంపద కలసివచ్చే సూచనలు ఉన్నాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు.
తులా రాశి
ఈ రాశి వారికి సప్తమ స్థానంలో రవి ఉచ్ఛ సంచరించడం వల్ల ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా అభివృద్ధి కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు అనూహ్యంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో అధికార యోగానికి తప్పకుండా అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు తీసుకొనే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో జీవితం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆదాయ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు విపరీతంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం సానుకూల పడుతుంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఆరవ స్థానంలో రవి సంచారం వల్ల ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా ఎంతో మేలు జరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందడం, మొండి బాకీలు వసూలు కావడం, ఉద్యోగంలో ఆదాయం పెరగటం, అదనపు ఆదాయ మార్గాలు చేతికి అందడం వంటి కారణాలవల్ల ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. యాక్టివిటీ పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావ రణం పడుతుంది. ఆస్తికి సంబంధించిన కోర్టు కేసులో విజయం సాధించడం జరుగుతుంది. శత్రువులు అణగి మణగి ఉంటారు.
ధను రాశి
ఈ రాశి వారికి పంచమ స్థానంలో రవి తన ఉచ్ఛ స్థానంలో సంచరించడం వల్ల ఆదాయం పెరగటం, ఆరోగ్యం సానుకూల పడటం, పిల్లలు పురోగతి సాధించడం, దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినటం వంటివి చోటు చేసుకుంటాయి. ఈ రాశి వారి ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వీరి సలహాలు సూచనలకు విలువ పెరుగుతుంది. లాటరీ, జూదం, షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు వంటివి బాగా కలిసి వస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. విదేశాలను సందర్శించే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి స్థిరత్వం లభిస్తుంది.
మకర రాశి
ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో రవి సంచరిస్తుండటం వల్ల గృహ వాహన సౌఖ్యాలకు అవకాశం ఉంది. ఇల్లు కానీ, స్థలం కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆస్తిపాస్తులు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు కుదుట పడుతుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల నుంచి లేదా తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. బంధు వర్గంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. తీర్థ యాత్రలు, దూర ప్రయాణాలు, విహార యాత్రలకు అవకాశం ఉంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి మూడవ స్థానంలో రవి సంచారం వల్ల రుణ సమస్యల నుంచి అనుకో కుండా విముక్తి లభిస్తుంది. ఆదాయం లేదా సంపాదన పెరుగుతుంది. ప్రయాణాలు వల్ల ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. బంధుమిత్రు లతో ఆప్యాయతలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులో విజయం లభిస్తుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. శుభకార్యం జరిగే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. చాలాకాలంగా పెండింగులో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో సానుకూలంగా పరిష్కారం అవుతుంది.
మీన రాశి
ఈ రాశి వారికి రెండవ స్థానంలో అంటే తన స్థానంలో రవి గురువులు కలవడం ఒక శుభ యోగం కింద భావించవచ్చు. ఆదాయం పెరిగి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సేవా సంస్థలకు విరాళాలు ఇవ్వటం వితరణలు చేయడం వంటివి చోటు చేసుకుం టాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు చేసే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులకు మేలు జరిగే పనులు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో సాన్నిహిత్యం ఏర్పడుతుంది.
ముఖ్యమైన పరిహారాలు
ఆదిత్య హృదయం పఠించడం వల్ల, సూర్య స్తోత్రం చదవడం వల్ల, సుందరకాండ పారాయణ చేయడం వల్ల శుభ ఫలితాలు త్వరగా అనుభవానికి వస్తాయి. ప్రతి ఆదివారం ఇంట్లోనే సూర్యభగవానుడికి పూజ చేయటం వల్ల కూడా ఉద్యోగ పరిస్థితి మెరుగుపడటం ఆరోగ్యం సానుకూలపడటం ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించడం వంటివి తప్పనిసరిగా చోటు చేసుకుంటాయి.
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).