Shukra Gochar: వృశ్చిక రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారిలో శృంగార వాంఛలు మితిమీరే అవకాశం..!

| Edited By: Janardhan Veluru

Dec 28, 2023 | 6:33 PM

ఈ నెల 28న వృశ్చికంలో ప్రవేశించబోతున్న శుక్రుడి కారణంగా ‘శృంగార రసం’ కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంటుంది. జనవరి 18 వరకూ శుక్రుడు ఇదే రాశిలో కొనసాగబోతున్నాడు. సాధారణంగా కుజుడికి చెందిన వృశ్చిక రాశిలో శుక్రుడు ప్రవేశించినప్పుడు ప్రేమ కార్యకలాపాలు, శృంగార కార్యకలాపాలు విజృంభించడం జరుగుతుంది. కోరికలను అదుపు చేయడం కష్టసాధ్యమవుతుంది. అక్రమ సంబంధాలకు, వివాహేతర సంబంధాలకు కూడా అవకాశం ఉంటుంది.

Shukra Gochar: వృశ్చిక రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారిలో శృంగార వాంఛలు మితిమీరే అవకాశం..!
Venus Transit in Scorpio
Follow us on

ఈ నెల 28న వృశ్చికంలో ప్రవేశించబోతున్న శుక్రుడి కారణంగా ‘శృంగార రసం’ కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంటుంది. జనవరి 18 వరకూ శుక్రుడు ఇదే రాశిలో కొనసాగబోతున్నాడు. సాధారణంగా కుజుడికి చెందిన వృశ్చిక రాశిలో శుక్రుడు ప్రవేశించినప్పుడు ప్రేమ కార్యకలాపాలు, శృంగార కార్యకలాపాలు విజృంభించడం జరుగుతుంది. కోరికలను అదుపు చేయడం కష్టసాధ్యమవుతుంది. అక్రమ సంబంధాలకు, వివాహేతర సంబంధాలకు కూడా అవకాశం ఉంటుంది. అనవసర పరిచయాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నందున జాగ్రత్తవహించాలి. అయితే, ఇది అన్ని రాశులకూ వర్తించే అవకాశం లేదు. ప్రస్తుతానికి ఈ ఫలితాలన్నీ వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులకే పరిమితం అవుతున్నాయి.

  1. వృషభం: ఈ రాశినాథుడైన శుక్రుడు సప్తమ రాశిలో, అందులోనూ వృశ్చికంలో ప్రవేశించడం వల్ల శృంగార కార్యకలాపాల్లో దూకుడు, దౌర్జన్యం వంటివి పెరిగే అవకాశం ఉంటుంది. శృంగార సంబంధమైన ఆలోచనలను అదుపు చేయడం లేదా నియంత్రించడం కష్టమవుతుంది. సాధారణంగా అక్రమ సంబంధాల కోసం, వివాహేతర సంబంధాల కోసం ప్రయత్నించే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోవడం, సాహస కృత్యాలకు పాల్పడడం వంటివి జరిగే అవకాశం ఉంది.
  2. కర్కాటకం: ఈ రాశివారికి అయిదవ స్థానంలో శుక్రుడు ప్రవేశిస్తున్నందువల్ల రాత్రింబగళ్లు శృంగార సంబంధ మైన ఆలోచనల్లోనే మునిగి తేలే అవకాశం ఉంటుంది. అక్రమ సంబంధాల కోసం ప్రయత్నాలు సాగించడం జరుగుతుంది. సాధారణంగా ప్రేమ వ్యవహారాలు కూడా కొత్త పుంతలు తొక్కుతాయి. శారీరక సుఖాల విషయంలో నియంత్రణ పాటించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. సాధారణంగా మంచి, చెడుల ఆలోచన కూడా తక్కువగా ఉంటుంది. కోరిక నెరవేరడమే ప్రధానంగా కనిపిస్తుంది.
  3. సింహం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో, అంటే సుఖ స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల సుఖాభిలాష విప రీతంగా పెరుగుతుంది. ఏదో విధంగా సుఖాలను అనుభవించాలన్న తాపత్రయం తలెత్తు తుంది. లైంగిక జీవితంలో కాస్తంత అతిగా వ్యవహరించే ప్రవృత్తి కలిగిన ఈ రాశివారికి నాలుగవ స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల లైంగిక జీవితానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. రుచులు, అభిరుచులు శ్రుతిమించిపోయే అవకాశం ఉంది. సాహసాలకు పాల్పడే సూచనలున్నాయి.
  4. తుల: ఈ రాశివారికి ధన స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల దాంపత్య జీవితం బాగా అనుకూలంగా, అన్యోన్యంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, అనవసర పరిచయాలకు దారి తీసే సూచనలు కూడా ఉన్నాయి. శుక్రుడు ఈ రాశికి అధిపతి అయినందువల్ల కొద్దిగా లైంగిక వాంఛలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మరీ అంతగా యథేచ్ఛగా వ్యవహరించే అవకాశం లేదు. వ్యసనాలకు, విలాస జీవితా నికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. కోరికల మీద కాస్తంత అదుపు ఉండే అవకాశం ఉంది.
  5. వృశ్చికం: ఈ రాశిలోనే శుక్ర సంచారం జరుగుతుండడం వల్ల ఈ రాశివారికి కోరికలు తీర్చుకునే విషయంలో అడ్డూ అదుపూ ఉండకపోవచ్చు. సాధారణంగా ఈ రాశివారు లైంగిక కార్యకలాపాల విషయంలో ఎంతో గోప్యంగా వ్యవహరించడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం వీరు మితిమీరి వ్యవహరించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, శుక్రుడు ఈ రాశివారికి సప్తమాధిపతి అయి నందువల్ల ఈ శుక్రుడి వీరికి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
  6. ధనుస్సు: ఈ రాశివారికి 12వ స్థానంలో, అంటే శయన స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల అక్రమ సంబంధాలకు అవకాశం ఉండడంతో పాటు, ఈ సంబంధాల మీద భారీగా ఖర్చయ్యే అవకాశం కూడా ఉంటుంది. లైంగిక సంబంధాల విషయంలో హద్దులు మీరి వ్యవహరించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ప్రవేశించడం కానీ, ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేయడం గానీ జరుగుతుంది. శారీరక సుఖాల విషయంలో రాజీపడడం, జాగ్రత్తగా ఉండడం వంటివి జరిగే అవకాశం కూడా లేదు.
  7. మకరం: ఈ రాశివారికి లాభ స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల కొన్ని ముఖ్యమైన పరిచయాలతో పాటు అనవసర పరిచయాలకు కూడా అవకాశం ఉంది. వీరిలో తప్పకుండా స్త్రీ వ్యామోహం లేదా లైంగిక వాంఛలు పెరగడం జరుగుతుంది. అయితే, దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగిపోయే అవకాశం కూడా ఉంది. సాధారణంగా చెడు సంబంధాల వైపు మనసు మొగ్గు చూపే అవకాశం ఉంది. మితిమీరిన వాంఛలు, అతి కాముకత్వం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది.