Shani Dhosham: ఈ పనులు చేస్తే శని దోషం బారిన పకడ తప్పదు.. లక్షణాలు, పరిహారాలు ఏమిటంటే..

|

Mar 18, 2025 | 8:21 AM

శనీశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు ఛాయాదేవిల తనయుడు. కర్మ ప్రధాత. మనిషి చేసే మంచు చెడులను అనుసరించి శిక్షణలు ఇచ్చే దైవం. శనిదూషణ సర్వదేవతలనూ తిట్టినదాంతో సమానం అని అంటారు. శనీశ్వరుడిని పూజిస్తే జీవితంలో ఆనందం ఉంటుంది. ఎవరైనా శని దోషం బారిన పడితే వారు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే జాతకంలో శని దోష నివారణకు కొన్ని పరిహారాలు ఉన్నాయి. వాటి ద్వారా శని దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు.

Shani Dhosham: ఈ పనులు చేస్తే శని దోషం బారిన పకడ తప్పదు.. లక్షణాలు, పరిహారాలు ఏమిటంటే..
Lord Shani Puja
Follow us on

జ్యోతిషశాస్త్రంలో శని దేవుడిని కర్మ ప్రదాత, న్యాయ దేవుడు అని చెబుతారు. శనీశ్వరుడిని అత్యంత క్రూరమైన గ్రహంగా కూడా పరిగణిస్తారు. వాస్తవానికి శనీశ్వరుడు తనని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి. శని దేవుడు అనుగ్రహం ఉంటే.. పేదవాడు కూడా రాజుగా మారతాడు. మరోవైపు శని దేవుడికి ఆగ్రహం కలిగితే జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. శని వ్యక్తి కర్మలను బట్టి అతనికి ఫలితాన్ని ఇస్తాడు. అతని పనుల ప్రకారం శిక్షిస్తాడు కూడా..

శనివారం శనీశ్వరుడి రోజు

హిందూ మతంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి, దేవతకు అంకితం చేయబడింది. శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ రోజున శనిశ్వరుడిని సరైన ఆచారాలతో పూజించే వారికి శని దేవుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం ఉంది. విజయం అతని పాదాలను ముద్దాడుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంది. జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు వ్యక్తి శని దోషం వల్ల ప్రభావితమవుతాడు. శని దోషం ఎప్పుడు వస్తుంది? దాని లక్షణాలు ఏమిటి? దీనిని నివారించడానికి చర్యలు ఏమిటి?

శని దోషం ఎప్పుడు వస్తుంది?

శని గ్రహం తిరోగమనంలో ఉన్నప్పుడు లేదా జాతకంలో నిమ్న స్థానంలో ఉన్నప్పుడు శని దోషం సంభవిస్తుందని జ్యోతిషశాస్త్రంలో చెప్పబడింది. అంతేకాదు ఎవరైనా ఏదైనా జీవిని చంపినా.. అతను శని దోషం బారిన పడతాడు. తన భార్యను అవమానించినా లేదా ఆమెతో తప్పుగా ప్రవర్తించినా శని దోషం అతనిపై ప్రభావం చూపుతుంది. మరోవైపు ఎవరైనా శనీశ్వరుడిని పూజించడంలో పొరపాటు చేస్తే అతను శని దోషంతో ప్రభావితమవుతాడు.

ఇవి కూడా చదవండి

శని దోష లక్షణాలు

జరుగుతున్న పనులకు అంతరాయం

అప్పు పెరుగుదల.

డబ్బు , ఆస్తి ఖర్చు.

చర్చ జరపడానికి

ఎంత కష్టపడి పనిచేసినా జీవితంలో విజయం సాధించలేరు.

శని దోషాన్ని నివారించడానికి ఈ నివారణలను అనుసరించండి.

శని దోషం తొలగిపోవడానికి శనివారం రావి చెట్టును పూజించాలి. ఆ చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి.

శనీశ్వరుడిని స్తుతించి శని చాలీసాను పారాయణం చేయాలి.

శనివారం శనీశ్వరుడికి ఆవ నూనెను సమర్పించాలి.

శనివారం శనీశ్వరుడికి మినప పప్పును సమర్పించాలి.

శనివారం శమీ వృక్షాన్ని పూజించాలి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు