Sakata Yoga: శకట యోగంతో ఆ రాశు వారికి కష్టనష్టాలు.. వీపు మీద బరువులు పెట్టుకొని పర్వతం ఎక్కినట్లే ఉంటది..! పరిహారాలు ఇవీ..

| Edited By: Janardhan Veluru

May 31, 2023 | 12:36 PM

జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు, చంద్రులకు షష్ఠాష్టకం ఏర్పడితే అంటే ఒకదానికొకటి 6, 8 స్థానాల్లో సంచరిస్తే దానిని శకట యోగం కింద పరిగణిస్తారు. జాతక చక్రంలోనే కాకుండా గ్రహ సంచారంలో కూడా ఈ రెండు గ్రహాల మధ్య షష్టాష్టకం ఏర్పడితే కొన్ని రకాల కష్టనష్టాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. వీపు మీద బరువులు పెట్టుకొని పర్వతం ఎక్కుతున్న వ్యక్తి ఈ శకట యోగానికి సంకేతం.

Sakata Yoga: శకట యోగంతో ఆ రాశు వారికి కష్టనష్టాలు.. వీపు మీద బరువులు పెట్టుకొని పర్వతం ఎక్కినట్లే ఉంటది..! పరిహారాలు ఇవీ..
Sakata Yoga
Follow us on

Zodiac Signs: జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు, చంద్రులకు షష్ఠాష్టకం ఏర్పడితే అంటే ఒకదానికొకటి 6, 8 స్థానాల్లో సంచరిస్తే దానిని శకట యోగం కింద పరిగణిస్తారు. జాతక చక్రంలోనే కాకుండా గ్రహ సంచారంలో కూడా ఈ రెండు గ్రహాల మధ్య షష్టాష్టకం ఏర్పడితే కొన్ని రకాల కష్టనష్టాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. వీపు మీద బరువులు పెట్టుకొని పర్వతం ఎక్కుతున్న వ్యక్తి ఈ శకట యోగానికి సంకేతం. ఉద్యోగపరంగా పని భారం లేదా బరువు బాధ్యతలు పెరగటం, కుటుంబపరంగా విపరీతమైన ఒత్తిడి ఉండటం, ఎంతో శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తి కావడం, అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవడం ఈ శకట యోగం లక్షణాలు. మేషం, వృషభం, సింహం, వృశ్చికం, కుంభరాశుల వారికి ఈ యోగం ఈ నెల 30వ తేదీ(బుధవారం) నుంచి మూడు రోజులపాటు పట్టబోతోంది.

  1. మేష రాశి: ఈ రాశి వారికి శకట యోగం వల్ల ఉద్యోగంలో పని భారం బాగా పెరిగి సుఖం, మనశ్శాంతి తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం లక్ష్యాలను పెంచడం తక్కువ గడువులో లక్ష్యాలను పూర్తి చేయాలని చెప్పడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో కూడా పని భారం పెరిగి ఒక్క క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. విశ్రాంతి లభించకపోవడం, అలసటకు లోనవటం వంటివి జరుగుతాయి. అదే సమయంలో కుటుంబ బాధ్యతలు విషయంలో కూడా అధిక శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది.
  2. వృషభ రాశి: ఈ రాశి వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇతరుల బాధ్యతలను నెత్తికెత్తుకోవాల్సి వస్తుంది. నిర్విరామంగా పనిచేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధితో పాటు తీరిక లేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఉద్యోగంలో సహచరుల బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సిన అగత్యం కలుగుతుంది. ఆర్థికంగా కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఈ అదనపు బాధ్యతల కారణంగా కుటుంబ సభ్యులు సైతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కుటుంబ పెద్దలలో ఒకరికి అనారోగ్యం చేయడం కూడా ఒత్తిడికి కారణం అవుతుంది.
  3. సింహ రాశి: సొంత పనులను పక్కనపెట్టి ఇతరుల బాధ్యతలను స్వీకరించడం వల్ల కష్టనష్టాలకు గురి కావలసి వస్తుంది. కొందరు బంధువులకు సహాయ సహకారాలు అందించబోయి, వారి పని భాగాన్ని పంచుకోవలసి వస్తుంది. ఉద్యోగంలోనే కాకుండా వృత్తి వ్యాపారాలలో కూడా నిర్విరా మంగా పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బంధువులకు సంబంధించిన శుభకార్యాలు లేదా అశుభ కార్యాలలో నిమగ్నం కావడం వల్ల విశ్రాంతి దూరం అవుతుంది. ఉద్యోగంలో అనవసర చాకిరి నెత్తిన పడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
  4. వృశ్చిక రాశి: గృహ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలతో విశ్రాంతి దూరం అవుతుంది. మరొక పక్క అదనపు ఆదాయ ప్రయత్నాలు మానసిక ప్రశాంతత లేకుండా చేసే అవకాశం ఉంది. ఒకేసారి అనేక పనులు, ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల ఉక్కిరి బిక్కిరి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తోబుట్టువుల నుంచి కూడా వ్యక్తిగత వ్యవహారాలలో ఒత్తిడి పెరగవచ్చు. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవడం ఇంటిని మరమ్మతులు చేసుకోవడం వంటి కారణాలవల్ల ఒత్తిడి పెరిగి స్వల్పంగా అనారో గ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. కుంభ రాశి: ఏలినాటి శని కారణంగా ఇప్పటికే పని భారంతో, అదనపు బాధ్యతలతో అవస్థలు పడుతున్న ఈ రాశి వారికి శకటయోగం మరికొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అనేక పనులను ఒకేసారి ప్రారంభించడం వల్ల క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభించక పోవచ్చు. మూడు రోజులపాటు దాదాపు ఒంటరి పోరాటం సాగించవలసి వస్తుంది. కుటుంబ సభ్యులలో ఒకరికి ఆందోళనకర స్థాయిలో అనారోగ్యం పీడించడం కూడా మానసికంగా ఒత్తిడి కలిగిస్తుంది.

పరిహారాలు: శకట యోగానికి తప్పకుండా పరిహారాలు పాటించడం మంచిది. శారీరక మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడానికి ఉదయమే విష్ణు సహస్రనామం లేదా హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణ చేయడం అవసరం. ఇతరుల బాధ్యతలలో పాలు పంచుకోకపోవడం, సొంత పనుల మీద దృష్టి పెట్టడం, ఒకటి రెండు పనులకు మాత్రమే పరిమితం కావడం కూడా సరైన పరిహారమే.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..