AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandradhi Yoga: ఆ రాశుల వారికి చంద్రాధి యోగం.. వీరికి ఉద్యోగపరంగా అదృష్టం తలుపుతట్టే అవకాశం..!

ఈ నెల 30వ తేదీ(మంగళవారం) నుంచి జూన్ నెల పదవ తేదీ వరకు గ్రహ సంచారం రీత్యా చంద్రాధి యోగం పట్టబోతోంది. చంద్రుడి నుంచి ఆరు ఏడు ఎనిమిది స్థానాలలో గురు, బుధ, శుక్ర గ్రహాలు సంచరిస్తున్నప్పుడు అధియోగం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత స్థాయికి వెళ్ళటానికి, అధికారం చేపట్టడానికి, మరింత మెరుగైన ఉద్యోగంలోకి మారటానికి..

Chandradhi Yoga: ఆ రాశుల వారికి చంద్రాధి యోగం.. వీరికి ఉద్యోగపరంగా అదృష్టం తలుపుతట్టే అవకాశం..!
Chandradhi Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 29, 2023 | 6:46 PM

Share

Employee Astrology: ఈ నెల 30వ తేదీ(మంగళవారం) నుంచి జూన్ నెల పదవ తేదీ వరకు గ్రహ సంచారం రీత్యా చంద్రాధి యోగం పట్టబోతోంది. చంద్రుడి నుంచి ఆరు ఏడు ఎనిమిది స్థానాలలో గురు, బుధ, శుక్ర గ్రహాలు సంచరిస్తున్నప్పుడు అధియోగం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత స్థాయికి వెళ్ళటానికి, అధికారం చేపట్టడానికి, మరింత మెరుగైన ఉద్యోగంలోకి మారటానికి, ఉద్యోగ సంబంధమైన సానుకూల మార్పులు చోటు చేసుకోవడానికి ఇది చాలావరకు అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వినటం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ చంద్రాధి యోగం వల్ల ప్రయోజనం పొందే రాశులు కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం. ఇవి ఏ విధంగా ఉత్తమ ఫలితాలను పొందబోయేది ఇక్కడ పరిశీలిద్దాం.

  1. కన్యా రాశి: ఈ రాశికి ప్రస్తుతం అష్టమ స్థానంలో గురు బుధ గ్రహాలు సంచరించడం వల్ల చంద్రాధియోగం ఏర్పడింది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాలలో తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రమోషన్ రావటం కానీ, అధికారం చేపట్టడం గానీ, టీం లీడర్ గా బాధ్యతలు తీసుకోవడం కానీ జరుగుతుంది. వృత్తిపరంగా కూడా గుర్తింపు లభించడం, డిమాండ్ పెరగటం, బిజీగా ఉండటం వంటివి చోటు చేసుకుంటాయి. మొత్తం మీద వృత్తి ఉద్యోగాల పరంగా ఒక ఆశాజనకమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో తప్పకుండా స్థిరత్వం కలుగుతుంది.
  2. తులా రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గురు, బుధ సంచారం వల్ల అధికార యోగానికి అవకాశం ఏర్పడింది. ఉద్యోగ పరిస్థితిలో అకస్మాత్తుగా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో తప్పకుండా మార్పు వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోసం లేదా ఉద్యోగం మారడం కోసం చేస్తున్న ప్రయత్నాలు సానుకూల పడతాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల పరంగా శుభ వార్తలు వినటం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది.
  3. వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆరవ స్థానంలో గురు, బుధ సంచారం వల్ల ఉద్యోగంలో ఆకస్మికంగా మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అధికారులు ఈ రాశి వారి ప్రతిభను అంకిత భావాన్ని గుర్తించి ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం, ప్రమోషన్ ఇవ్వడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ పరంగానే కాకుండా వృత్తి పరంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. వృత్తిపరంగా అనూహ్యమైన రీతిలో పురోగతి చెందడం జరుగుతుంది. ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా మారుతుంది. వృత్తిలో డిమాండ్ పెరుగుతుంది.
  4. ధనుస్సు రాశి: ఈ రాశి వారికి అష్టమంలో శుక్ర గ్రహ సంచారం వల్ల అధికార యోగం ఏర్పడింది. భారీ వేతనా లతో కూడిన ప్రమోషన్ పొందటానికి ఇది దోహదం చేస్తుంది. ఉద్యోగ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోవడానికి కూడా ఇది అవకాశం కల్పిస్తుంది. ఉద్యోగంలో తప్పకుండా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి శుభవార్త అందుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా తప్పకుండా కొన్ని శుభ పరిణామాలు అనుభవానికి రావడం జరుగు తుంది. అధికారులతో లేదా యజమానులతో సత్సంబంధాలు ఏర్పడటం కూడా జరిగే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మకర రాశి: మకర రాశి వారికి సప్తమ స్థానంలో శుక్ర సంచారం వల్ల అధియోగం లేదా అధికార యోగం ఏర్పడింది. దీనివల్ల అధికారుల నుంచి మంచి గుర్తింపు లభించడంతోపాటు ఆదరణ, ప్రోత్సాహం పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరంగా తప్పకుండా ఒకటి రెండు సానుకూల మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరగటం కూడా జరుగుతుంది. ఉద్యోగపరంగా అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగం మారటానికి ప్రయత్నం చేస్తున్న వారు సఫలం అవుతారని చెప్పవచ్చు.
  7. కుంభ రాశి: ఈ రాశి వారికి ఆరవ స్థానంలో శుక్ర సంచారం వల్ల అధియోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల ఉద్యోగ పరంగా అదృష్టం పొందుతుంది. ఉద్యోగ పరంగా ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆదాయం పెరగటం, ప్రమోషన్ రావటం, అధికారుల ఆదరణ లభించడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. వృత్తిపరంగా కూడా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిలో డిమాండ్ పెరిగి క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా ఆదాయం పెరగటానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..