Ruchaka Yoga: రుచక యోగం..ఆ రాశుల వారు సంపన్నులు కావడం పక్కా..!
Kuja in Makara Rashi: పంచ మహా పురుష యోగాల్లో ఒకటైన రుచక మహా పురుష యోగం జనవరి 16 నుండి ఫిబ్రవరి 23 వరకు నాలుగు రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. కుజుడు మకరంలో ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల వారికి రాజయోగం, ధనప్రాప్తి, ఉన్నత స్థానం, వృత్తిలో విజయాలు వంటి శుభ ఫలితాలు లభిస్తాయి. ఇది ఆరోగ్యం, ఆస్తి వివాదాల పరిష్కారానికి కూడా తోడ్పడుతుంది.

Ruchaka Maha Purusha Yoga
పంచ మహా పురుష యోగాల్లో రుచక మహా పురుష యోగం ఒకటి. ఏదైనా రాశికి కుజుడు 1, 4, 7, 10 స్థానాల్లో ఉచ్ఛ, స్వక్షేత్రాల్లో సంచారం చేస్తున్నప్పుడు రుచక మహా పురుష యోగం కలుగుతుంది. ఈ యోగం వల్ల నాలుగు రాశుల వారు దాదాపు ప్రతి విషయంలోనూ ఉన్నత స్థానానికి వెళ్లడం జరుగుతుంది. ఈ నెల(జనవరి) 16 నుంచి ఫిబ్రవరి 23 వరకు కుజ గ్రహం తన ఉచ్ఛ క్షేత్రమైన మకర రాశిలో సంచారం చేస్తున్నందువల్ల నాలుగు రాశుల వారికి రుచక మహా పురుష యోగం కలిగింది. ఈ యోగం మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు ఏర్పడింది. అధికార యోగం పట్టడం, ఉన్నత స్థానాలకు వెళ్లడం, సంపన్నులు కావడం వంటివి ఈ యోగం లక్షణాలు.
- మేషం: రాశ్యధిపతి కుజుడు ఈ రాశికి దశమ కేంద్రంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి రుచక మహా పురుష యోగం పట్టింది. ఇది అధికార యోగంతో పాటు ధన ధాన్య సమృద్ధి యోగం కూడా కలిగిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశాల్లో సంపాదించుకోవడానికి అవ కాశం కలుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలన్నీ చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి సప్తమ కేంద్రంలో కుజుడి ఉచ్ఛ స్థితి వల్ల ఈ రాశివారికి రుచక మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ఒక వెలుగు వెలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఒక సంస్థకు ఆధిపత్యం వహించే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సంపాదన యోగం పడుతుంది.
- తుల: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో కుజుడు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి రుచక యోగం ఏర్పడింది. దీనివల్ల గృహ, వాహనాలు కలుగుతాయి. ఆస్తిపాస్తులు సమకూరుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు గడించడం జరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడు కావడం జరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి.
- మకరం: ఈ రాశిలో కుజుడు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి రుచక మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల రాజయోగాలు పడతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశముంది. సమాజంలో ఒక ప్రముఖుడిగా చెలామణీ సూచనలున్నాయి. ఆస్తి వివాదం పరిష్కారం కావడం, ఆస్తి విలువ పెరగడం, ఆస్తి సంక్రమించడం వంటివి జరిగే అవకాశముంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు బాగా వృద్ధి చెందుతాయి.