Rasi Parivarthan
ఈ నెల 16 నుంచి రవి, బుధ గ్రహాల మధ్య రాశి పరివర్తన జరగబోతోంది. అంటే బుధుడికి చెందిన కన్యా రాశిలో రవి, రవికి చెందిన సింహ రాశిలో బుధుడు సంచారం చేయడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల మధ్య పరివర్తన జరగడం అనేది బుధాదిత్య యోగం కంటే రెట్టింపు బలంతో శుభ ఫలితాలనిస్తుంది. ఈ పరివర్తన వల్ల పెండింగ్ పనులన్నీ పూర్తయి ఆర్థిక లాభం కలుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ రెట్టింపు ఫలితాలనిస్తాయి. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనూ రాశుల వారు ఈ యోగం వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి నాలుగు, అయిదు స్థానాల అధిపతుల మధ్య పరివర్తన చోటు చేసుకుంటున్నందువల్ల రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ తాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు, సత్కారాలు లభిస్తాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థతకు ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి.
- మిథునం: ఈ రాశినాథుడైన బుధుడితో రవికి పరివర్తన జరిగినందువల్ల ఏ రంగంలోని వారికైనా శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి అనేక శుభ యోగాలు, ఆర్థిక యోగాలు అను భవానికి వస్తాయి. ఆకస్మిక ధన లాభాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పండుగ వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలకు ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి ధనాధిపతి రవితో బుధుడికి పరివర్తన జరిగినందువల్ల ఆదాయ సంబంధమైన ఏ ప్రయత్నమైనా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి తప్పకుండా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభి స్తాయి. తండ్రి ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.
- సింహం: రాశ్యధిపతి రవికి ధన స్థానాధిపతి బుధుడితో పరివర్తన జరిగినందువల్ల ఆదాయం దిన దినాభి వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి రావలసిన సొమ్ము తప్పకుండా చేతికి అందుతుంది. బాకీలన్నీ వసూలవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.
- వృశ్చికం: ఈ రాశికి దశమ, లాభ స్థానాల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ఆకస్మిక ధన ప్రాప్తి తప్ప కుండా ఉంటుంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీత భత్యాలు బాగా పెరగడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కనక వర్షం కురిపిస్తాయి. సామాజి కంగా కూడా కొత్త హోదా, స్థాయి లభిస్తాయి. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేయడం జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- ధనుస్సు: ఈ రాశికి భాగ్య, దశమాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. సామాజిక స్థాయి, జీవనశైలి మారిపోయే అవకాశం ఉంది. అదనపు ఆదాయానికి ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి