Mrityu Panchak 2023: హిందూ పురాణ గ్రంధాలలో పంచక కాలం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పంచక సమయంలోని ఐదు రోజులలో శుభకార్యాలు చేయడం నిషేధం. పంచకం ప్రతి నెల వస్తుంది. అయితే పంచకం వచ్చే నెలలోని రోజుపై ఆధారపడి శుభ అశుభాలు ఏర్పడతాయి. ఎందుకంటే రోగ పంచకము, రాజ పంచకము, అగ్ని పంచకము, మృత్యు పంచకము, చోర పంచకము వంటి వివిధ రకాల పంచకాలున్నాయి. ప్రస్తుతం మే 13వ తేదీన ఏర్పడనుంది మృత్యు పంచకం.
హిందూ సనాతన ధర్మంలోని నమ్మకం ప్రకారం మృత్యు పంచక కాలంలో ఎవరైనా మరణిస్తే, అది కుటుంబానికి మంచిది కాదు. అంతేకాదు ఆ కుటుంబంలో కలిగే ఇబ్బందులను సూచిస్తుందని చెబుతారు. కనుక మృత్యు పంచకం ఎప్పుడు మొదలవుతుంది.. ఈ పంచకంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది ఈ రోజు తెలుసుకుందాం.
మృత్యు పంచక సమయం..
మృత్యు పంచకం మే 13, 2023 ఉదయం 12:18 గంటలకు ప్రారంభమై మే 17, 2023 ఉదయం 07:39 గంటలకు ముగుస్తుంది.
పంచక సమయంలో ఏ రాశులు నివసిస్తాయంటే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 27 రాశులున్నాయి. ఈ 27 రాశులలో.. చివరి ఐదు రాశులు – ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్రపద, ఉత్తరాభాద్రపద , రేవతి రాశుల కలయికను పంచకం అంటారు. ఈ ఐదు రాశుల కలయిక అశుభం. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. చంద్రుడు కుంభ, మీన రాశుల్లో సంచరించినప్పుడు పంచకం కాలం ఏర్పడుతుంది.
మృత్యు పంచకం అని ఎందుకు అంటారు?
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. శనివారం నుండి పంచకం ప్రారంభమైతే.. దానిని మృత్యు పంచకం అంటారు. ఈ పంచకం మృత్యువువలె ఇబ్బందికరమైనది. అందుకే ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్కులు సూచిస్తున్నారు.ఎందుకంటే మృత్యు పంచకం అస్సలు మంచిదికాదు. ఈ సమయంలో చేసే శుభకార్యము వలన మృత్యువు సంభవించ వచ్చును.
మృత్యు పంచకంలో ఏ పనులు చేయడకూడదంటే..
మృత్యు పంచకం ఉన్న ఈ ఐదు రోజుల్లో కలపను సేకరించడం లేదా కొనుగోలు చేయడం నిషేధం.
ఇంటి పై కప్పు నేయరాదు, మంచాల తయారీ చేయరాదు.
అంతేకాదు ఈ ఐదు రోజుల్లో దక్షిణ దిశలో ప్రయాణించడం మానుకోవాలి. దీని వెనుక ఉన్న విశ్వాసం ఏమిటంటే, దక్షిణ దిశను యమ దిక్కుగా భావిస్తారు. కనుక ఈ ఐదు రోజులు దక్షిణ దిక్కులో ప్రయాణం చేయడం ప్రమాదాలు పాలయ్యే అవకాశం ఉంది. గాయాల బారిన పడవచ్చు.
ఈ పంచకంలో ఎవరైనా మరణిస్తే..అదే గ్రామంలో మరో 5 మంది చనిపోతారని నమ్ముతారు. కనుక పంచకంలో మరణిస్తే, మరణించిన వ్యక్తికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మాత్రమే దహన సంస్కారాలు చేస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).