Mercury Set 2023: రేపు బుధుడు అస్తమయం.. ఈ మూడు రాశులు పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారా..
బుధుడు ఎవరి జాతకంలో మంచి స్థానంలో ఉంటే వారికి తెలివితేటలకు కొదవ ఉండదు. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. బుధుడు ఏప్రిల్ 23, రాత్రి 11.58 గంటలకు మేషరాశి నుంచి అస్తమించనున్నాడు. బుధుడి అస్తమయం కారణంగా మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మనిషి జీవితంలో గ్రహాల ప్రభావం ఉంటుంది. ప్రతి ఒక్కరి జాతకంలో గ్రహాలు ఉదయించడం, అస్తమించడం తప్పనిసరి. గ్రహాల్లో ఒకటైన బుధుడు మేధస్సుకు కారకుడుగా పరిగణిస్తారు. బుధుడు ఎవరి జాతకంలో మంచి స్థానంలో ఉంటే వారికి తెలివితేటలకు కొదవ ఉండదు. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. బుధుడు ఏప్రిల్ 23, రాత్రి 11.58 గంటలకు మేషరాశి నుంచి అస్తమించనున్నాడు. బుధుడి అస్తమయం కారణంగా మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశిలో తృతీయ, ఆరవ ఇంటికి బుధుడు అధిపతి. రేపు బుధుడు అస్తమయం కారణంగా వీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని భవిష్యత్ కు బంగారు బాట వేసుకుంటారు. కాంపిటేషన్ పరీక్షలకు రెడీ అవుతున్న స్టూడెంట్స్ సక్సెస్ అందుకుంటారు. వ్యాపారస్తులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మిధున రాశి: ఈ రాశి వారి జాతకంలోని పదకొండవ ఇంట్లో బుధుడు అస్తమిస్తాడు. బుధుడు ఈ అస్తమయం ఈ రాశి వ్యక్తులకు శుభఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో మంచి బెనిఫిట్స్ పొందుతారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. లాభాలు వస్తాయి. వీరు చేసే ప్రతి పనిలో గెలుపు అందుకుంటారు.
కన్య రాశి : ఈ రాశివారు ఎనిమిదవ ఇంట్లో బుధుడు అస్తమించనున్నాడు. బుధుడి గోచారం ఈ రాశివారికి అన్నింటా మేలు చేస్తుంది. కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. వ్యాపారస్తులు అధిక ప్రయోజనం పొందుతారు. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ల్లో పెట్టిన పెట్టుబడి లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)