AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuja Gochar: కుంభ రాశిలో కుజుడు.. ఆ రాశుల వారికి ధన లాభం, భూ లాభం..!

Mars Transit 2026: ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 వరకు కుజుడు కుంభ రాశిలో సంచారం చేస్తున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక స్థిరత్వం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తి, భూసంబంధిత లాభాలకు కారకుడైన కుజుడు స్థిర రాశి అయిన కుంభంలో ప్రవేశించడం వలన కొద్ది ప్రయత్నంతోనే గృహలాభం, స్థిరాస్తి లాభం పొందే యోగాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా మేషం, వృషభం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు ఈ అయిదు వారాల కాలంలో విశేష ప్రయోజనాలను అనుభవించే అవకాశం ఉంది.

Kuja Gochar: కుంభ రాశిలో కుజుడు.. ఆ రాశుల వారికి ధన లాభం, భూ లాభం..!
Kuja Gochar 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 20, 2026 | 7:11 PM

Share

ఈ నెల (ఫిబ్రవరి) 23 నుంచి ఏప్రిల్ 2 వరకు కుంభ రాశిలో సంచారం చేయబోతున్న కుజుడి వల్ల కొందరి జీవితాల్లో ఆర్థిక స్థిరత్వానికి అవకాశం కలుగుతుంది. ఆస్తిపాస్తులకు, భూలాభానికి కారకుడైన కుజుడు స్థిర రాశి అయిన కుంభంలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశులకు కొద్ది ప్రయత్నంతో, కొద్ది శ్రమతో తప్పకుండా గృహ లాభంతో పాటు స్థిరాస్తి లాభం కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, వృషభం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు కుంభ కుజుడి వల్ల అయిదు వారాల పాటు అత్యధికంగా లాభం పొందే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు లాభ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై భూ సంబం ధమైన ఆస్తి కలిసి వస్తుంది. స్థలం కొనే అవకాశం ఉంది. ఇల్లు, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బును, బాకీల్ని పట్టుదలగా రాబట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.
  2. వృషభం: పట్టుదలకు, ధైర్య సాహసాలకు మారుపేరైన కుజుడు ఈ రాశికి దశమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆస్తిపాస్తులకు సంబంధించిన వివాదాలు, కోర్టు కేసుల్లో తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు, జీతభత్యాలు కూడా పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వారు బాగా రాణిస్తారు. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. గృహ యోగం పడుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.
  3. సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి రాజయోగాలు, ధన యోగాలు ఎక్కువగా కలుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. పదోన్నతి లభించడానికి అవకాశం ఉంది. జీతభత్యాలు, అదనపు రాబడి పెరిగే సూచనలున్నాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. నిరుద్యోగులకు భారీ జీత భత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి.
  4. వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల తప్ప కుండా స్థిరాస్తులు పెరుగుతాయి. గృహ యోగం పట్టే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనేక మార్గాల ద్వారా ఆదాయం వృద్ది చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. రావలసిన డబ్బును, బాకీలను పట్టుదలగా వసూలు చేసుకుంటారు. తండ్రి వైపు నుంచి కూడా బాగా ఆస్తి కలిసి వస్తుంది.
  5. మకరం: ఈ రాశికి ధన స్థానంలో కుజ సంచారం వల్ల స్థలాలు, పొలాల కొనుగోలు మీద దృష్టి పడుతుంది. గృహ ప్రయత్నాలు చేపట్టడానికి ఇది సరైన సమయం. ఆస్తికి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా, వివాదాలున్నా అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభిస్తాయి. సామాజికంగా హోదా పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
  6. కుంభం: ఈ రాశిలో ప్రవేశించి అయిదు వారాల పాటు ఉండబోతున్న కుజుడు ఆస్తుల కొనుగోలు మీదా, రియల్ ఎస్టేట్ మీదా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. లాభదాయక ఒప్పందాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బును గట్టి ప్రయత్నంతో వసూలు చేస్తారు. ఉద్యోగంలో జీతభత్యాలు భారీగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి, అభివృద్ధి బాటపడతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

Follow Us