Viparita Raja Yoga: వృశ్చిక రాశిలోకి కుజ, రవి గ్రహాలు.. ఆ రాశుల వారికి తిరుగులేని రాజయోగం..!
ఏక కాలంలో కుజ, రవులు వృశ్చిక రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. ఇందులో కుజుడికి ఈ వృశ్చిక రాశి స్వక్షేత్రం కాగా, రవి గ్రహానికి ఈ రాశి మిత్ర రాశి. మొత్తానికి ఈ రెండు గ్రహాలకు వృశ్చికం అత్యుత్తమ స్థానం. ఈ రెండు గ్రహాల వల్ల ఎనిమిది రాశులు బాగా లబ్ధి పొందబోతున్నాయి. విపరీత రాజయోగానికే కాక, విపరీత భాగ్య యోగానికి కూడా అవకాశం ఉంది. వచ్చే నెల 17వ తేదీ వరకు ఈ రాజయోగం కొనసాగుతుంది.
ఈ నెల 17వ తేదీన ఏక కాలంలో కుజ, రవులు వృశ్చిక రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. ఇందులో కుజుడికి ఈ వృశ్చిక రాశి స్వక్షేత్రం కాగా, రవి గ్రహానికి ఈ రాశి మిత్ర రాశి. మొత్తానికి ఈ రెండు గ్రహాలకు వృశ్చికం అత్యుత్తమ స్థానం. ఈ రెండు గ్రహాల వల్ల ఎనిమిది రాశులు బాగా లబ్ధి పొందబోతున్నాయి. విపరీత రాజయోగానికే కాక, విపరీత భాగ్య యోగానికి కూడా అవకాశం ఉంది. వచ్చే నెల 17వ తేదీ వరకు ఈ రాజయోగం కొనసాగుతుంది. ఇందులో మకరం, తుల, కర్కాటక రాశుల వారికి తప్పకుండా మహాభాగ్య యోగం పడుతుందని చెప్పవచ్చు. ఈ ఎనిమిది రాశులుః వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకరం, కుంభం, మీనం.
- వృషభం: ఈ రాశికి సప్తమ రాశిలో కుజ, రవులు కలిసి ఉండడం వల్ల, తప్పకుండా రాజయోగం పడు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ రావడం గానీ, అధికారం చేపట్టడం కానీ జరుగుతుంది. వ్యాపా రాల్లో కూడా అంచనాలకు మించిన రాబడి ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. రాజకీయంగా ఆశించిన పురోగతి ఉంటుంది. రియల్ ఎస్టేట్, మద్యం వంటి రంగాలకు చెందినవారికి తిరుగుండదు. సంపన్న కుటుంబంలో వివాహం నిశ్చయం అవుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ, రవులు కలవడం వల్ల ఈ రాశికి చెందిన రాజకీయ నాయకు లకు తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఈ రాశివారికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడు తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నవారికి, పోటీ పరీక్షలు రాస్తున్నవారికి విజయం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రాధాన్యం పెరుగుతుంది. ఏ రంగానికి మచెందినవారై నప్పటికీ ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశినాథుడైన రవి తన మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశిలో, మిత్రుడైన కుజ గ్రహంతో కలిసి ఉండ డం వల్ల తప్పకుండా విపరీత రాజయోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో దూసుకుపో తారు. ఉద్యోగంలో తప్పకుండా ప్రమోషన్ లభించడం, ప్రాభవం, ప్రాబల్యం పెరగడం జరుగుతుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నిస్తున్నవారికి మంచి ఆఫర్లు అందివస్తాయి. నిరుద్యోగులకు ఆఫర్లు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే సూచనలున్నాయి. సామాజిక హోదా కలుగుతుంది.
- తుల: ఈ రాశివారికి ధన స్థానంలో ధనాధిపతి కుజుడు స్వక్షేత్రంలో ఉండడం, ఆ గ్రహంతో లాభాధిపతి కలిసి ఉండడం వల్ల అప్రయత్న ధన లాభానికి, ఆకస్మిక ధన యోగానికి అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు చక్కబడతాయి. మాటకు, చేతకు విలువ పెరుగు తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. సతీమణికి మంచి పురోగతి ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి రాబడి బాగా పెరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశిలో రాశినాథుడు ప్రవేశించడంతో పాటు దశమాధిపతితో కలిసి ఉండడం వల్ల నిరుద్యోగు లకు మంచి అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగం మారాలనుకునేవారి ప్రయత్నాలు సఫలం అవు తాయి. ఏ రంగంలో ఉన్నవారికైనా ప్రాభవం, ప్రాబల్యం పెరుగుతాయి. తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఒక సంస్థకు ప్రధాన కార్యనిర్వాహకుడయ్యే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ప్రముఖుడుగా మారడం జరుగుతుంది.
- మకరం: ఈ రాశివారికి అటు వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా ఇటు ఆర్థికంగా, ఆదాయపరంగా కూడా విపరీత రాజయోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది. నిరుద్యోగులకు అనేక సంస్థల నుంచి ఆఫర్లు అందే సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కూడా అంచనాలకు మించి విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన దాని కంటే ఎక్కువగా మెరుగుపడుతుంది. ఉద్యోగపరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది.
- కుంభం: ఈ రాశికి దశమ స్థానమైన వృశ్చికంలోకి రాశినాథుడు కుజుడు రవితో కలిసి ప్రవేశించడం వల్ల రాజకీయ, రియల్ ఎస్టేట్, ప్రభుత్వ రంగాలవారికి మంచి రాజయోగం పడుతుంది. ఆదాయం బాగా పెరగడంతో పాటు తప్పకుండా అధికారం చేపట్టే అవకాశం కూడా ఉంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పనిచేస్తున్న సంస్థకు మంచి పేరు తీసుకు రావడం జరుగుతుంది. అధికా రులు మంచి ప్రోత్సాహకాలతో ఆదరిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
- మీనం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి కుజుడు ప్రవేశించడంతో పాటు, అక్కడ మిత్ర గ్రహమైన రవితో కలవడం వల్ల, వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా రాజయోగం లేదా అధికార యోగం పడు తుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. తండ్రికి కూడా యోగం పడుతుంది, పిత్రార్జితం చేతికి అందుతుంది. ప్రభుత్వ రంగంలోని వారికి అధికారంతో పాటు, ఆర్థిక యోగం కూడా పడుతుంది. విదేశాల నుంచి ఆహ్వానాలు, శుభవార్తలు అందుతాయి.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..