Horoscope Today: ఆ రాశి వారికి వస్తు, వాహన యోగం.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు ఇలా..

దిన ఫలాలు (నవంబర్ 15, 2023): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు తప్పకుండా అదనపు పని భారం ఉంటుంది. వృషభ రాశి వారు చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రాజె క్టులు చేపడతారు. మిథున రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారికి వస్తు, వాహన యోగం.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు ఇలా..
Horoscope Today 15th November 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 15, 2023 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 15, 2023): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు తప్పకుండా అదనపు పని భారం ఉంటుంది. వృషభ రాశి వారు చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రాజె క్టులు చేపడతారు. మిథున రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు తప్పకుండా అదనపు పని భారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్ప డతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపారంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రాజె క్టులు చేపడతారు. కుటుంబ సభ్యులతో, కొందరు ఇష్టమైన బంధువులతో శుభ కార్యాల్లో పాల్గొం టారు. స్థిరాస్తి వివాదాలు, వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. వస్తు, వాహన యోగం ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. వ్యయ ప్రయాసలున్నప్పటికీ, పెండింగు పనులన్నిటినీ పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా బాధ్య తలు నెరవేరుస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయ త్నాలు సఫలం అవుతాయి. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. సతీమణి వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగానే సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం సానుకూలంగానే సాగిపో తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలు అందరికీ నచ్చుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. మిత్రులకు సహాయపడ తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగు తుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వాహన యోగం ఉంది. ఒక ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీర్ఘకాలిక ఆస్తి సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ప్రస్తుతానికి ఎవరికీ ఆర్థిక సంబంధమైన వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థికంగా అన్ని విధాలుగానూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు చాలావరకు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. రుణ ప్రయత్నాల జోలికి వెళ్లకపోవడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్య మైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది కానీ, స్థాన చలనానికి అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొందరు బంధువుల వివాదంలో మధ్యవర్తిత్వం చేస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లో చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు అందివస్తాయి. కొత్త బాధ్యతలు మీద పడతాయి. సంతానానికి సంబంధించి విద్యా, ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో సతీమణి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆదాయం, ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. ఆర్థికపరంగా కొన్ని సమస్యలను అధిగమిస్తారు. ప్రయాణాల్లో కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. సతీమణితో దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల విషయంలో మరింత శ్రద్ధమ తీసుకోవాల్సి ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయం కంటే ఖర్చు బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సతీమణికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?