Malika Yoga: ఆ రాశుల వారికి అద్వితీయమైన యోగం.. ఉద్యోగంలో ప్రసిద్ధులయ్యే అవకాశం
ప్రస్తుతం ధనూ రాశి నుంచి మేష రాశి వరకు ప్రధాన గ్రహాలన్నీ వరుసగా సంచారం చేస్తున్నాయి. అంటే, ధనుస్సులో కుజ, శుక్రులు. మకరంలో రవి, బుధులు, కుంభంలో శనీశ్వరుడు, మీనంలో రాహువు, మేషంలో గురువు సంచారం చేస్తుండడం వల్ల ఒక అద్వితీయమైన యోగం ఏర్పడింది. జ్యోతిష శాస్త్రంలో దీనిని మాలికా యోగంగా పరిగణించడం జరుగుతుంది. ఈ మాలికా యోగం వల్ల వివిధ రాశుల వారు వివిధ మార్గాల్లో ప్రసిద్ధులయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ధనూ రాశి నుంచి మేష రాశి వరకు ప్రధాన గ్రహాలన్నీ వరుసగా సంచారం చేస్తున్నాయి. అంటే, ధనుస్సులో కుజ, శుక్రులు. మకరంలో రవి, బుధులు, కుంభంలో శనీశ్వరుడు, మీనంలో రాహువు, మేషంలో గురువు సంచారం చేస్తుండడం వల్ల ఒక అద్వితీయమైన యోగం ఏర్పడింది. జ్యోతిష శాస్త్రంలో దీనిని మాలికా యోగంగా పరిగణించడం జరుగుతుంది. ఈ మాలికా యోగం వల్ల వివిధ రాశుల వారు వివిధ మార్గాల్లో ప్రసిద్ధులయ్యే అవకాశం ఉంది. ఈ మాలికా యోగం వల్ల ఈ రాశులకు ఎదురుగా ఉన్న మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా రాశివారు ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రసిద్ధులయ్యే అవకాశం ఉంది. ఈ యోగం మరో రెండు నెలల పాటు కొనసాగడం జరుగుతుంది. నెహ్రూ ఈ మాలికా యోగం వల్లే ప్రసిద్ధులయ్యారని ప్రతీతి.
- మిథునం: ఈ రాశివారికి ఈ మాలికా యోగం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవ కాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరగడంతో పాటు వ్యక్తిగతంగా కూడా పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. వీరి ఆలోచనలు, అభిప్రాయాలకు విలువ పెరుగు తుంది. సప్తమ స్థానం నుంచి లాభ స్థానం వరకు గ్రహాలన్నీ వరుసగా సంచారం చేస్తున్నందువల్ల అన్ని విధాలుగానూ ఆర్థిక బలం పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు వృద్ధి చెందుతాయి.
- కర్కాటకం: ఈ రాశివారికి మాలికా యోగం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగానికి అవకాశం ఉంది. అధికార యోగం పట్టడానికి వీలు కల్పించే సంస్థలోకి మారడం జరిగే అవకాశం కూడా ఉంది. నిరు ద్యోగులకు ఆశించిన కంపెనీలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. విదేశీ ఉద్యోగాలు లభించే అవ కాశం కూడా ఉంది. కెరీర్ లోనే కాకుండా సామాజికంగా కూడా హోదా, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. అనేక శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి.
- సింహం: ఈ రాశివారికి రాజకీయపరంగా, ప్రభుత్వపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనేక విధాలుగా అదృష్టం పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. నిరుద్యోగులకు అంచనాలు, అర్హతలకు మించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. గృహ, వాహన సౌకర్యాలు బాగా పెరుగుతాయి.
- కన్య: ఈ రాశివారికి ధన బలం బాగా పెరుగుతుంది. ఆస్తి విలువ పెరగడం, ఆస్తిపాస్తులు కలిసి రావడం, ఆస్తులు కొనుగోలు చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. ఉద్యోగంలో సాను కూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగాలు లభించే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
- తుల: ఈ రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడం, పోటీదార్లు తప్పుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో భాగస్వాములతో విభేదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గి మనశ్శాంతి ఏర్ప డుతుంది. అపార ధన లాభ సూచనలున్నాయి. అకస్మాత్తుగా జీవితం మారిపోవడం జరుగుతుంది.