Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఫిబ్రవరి 2, 2024): మేష రాశి వారికి శుభ గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ కార్యం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృషభ రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (ఫిబ్రవరి 2, 2024): మేష రాశి వారికి శుభ గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ కార్యం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృషభ రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శనీశ్వరుడితో పాటు ఇతర శుభ గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ కార్యం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆశించిన శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి జీవి తంలో బాగా బిజీ అవడం జరుగుతుంది. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వ్యక్తిగత ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
బుధ, రవులతో పాటు రాశ్యధిపతి శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ముఖ్యంగా అత్యవసర పనులలో కార్య సిద్ధి కలుగుతుంది. ఇంటా బయటా ఏ పని తలపెట్టినా సానుకూలంగా పూర్తవుతుంది. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం పరవాలేదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ముఖ్యమైన శుభ గ్రహాలు శుభ స్థానాల్లో ఉన్నందువల్ల ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. రావాల్సిన డబ్బు వసూలు అవుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శత్రువులు, పోటీదార్లు తగ్గి ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అన్ని విధాలా సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. అటు కుటుంబ సభ్యులతోనూ, ఇటు మిత్రులతోనూ బాగా ఎంజాయ్ చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలున్నా పట్టుదలగా అత్యవసర వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాలి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమా జంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు చేసి ప్రయోజనం పొందుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రోజంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. ఇష్టమైన పనులు చేస్తారు. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అవస రానికి డబ్బు అందు తుంది. రావాల్సిన డబ్బును వసూలు చేసుకుంటారు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపో తాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుకుంటారు. తలపెట్టిన పనుల్ని అనుకున్న సమ యానికి పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా మారుతుంది. ఉద్యోగావకాశాలు బాగా మెరుగు పడతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురో గతి ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలతో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పట్టుదలతో వ్యవహరించి కొన్ని వివాదాలను, విభేదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో కూడా ఆశించిన లాభాలు చవి చూస్తారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
దాదాపు ప్రతి రంగంవారికీ ఏదో విధమైన పురోగతి ఉంటుంది. రోజంతా సానుకూలంగా, సంతృప్తి కరంగా గడిచిపోతుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో దూసుకుపోతారు. విదేశాల నుంచి ఆశిం చిన సమాచారం అందుతుంది. తల్లితండ్రుల నుంచి ఆస్తికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. సామాజికంగా గౌరవ మర్యాదలకు లోటుండదు. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా. ఆశాజనకంగా సాగి పోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు పూర్తవుతాయి. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
సర్వత్రా పని ఒత్తిడి, పని భారం ఉండవచ్చు. కాస్తంత ఓర్పు సహనాలతో వ్యవహరించడం చాలా మంచిది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగానే సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు, సహాయం కోసం బంధుమిత్రుల నుంచి ఒత్తిడి ఇబ్బంది పెడతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపో తుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా లాభాలనిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించిపోతుంది. ఏలిన్నాటి శని కారణంగా ఇంటా బయటా ఒత్తిడి ఉండడం, శుభ కార్యాల మీద బాగా ఖర్చు కావడం జరుగుతుంది. ఇత రుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. జీవిత భాగస్వామితో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి.