Lucky Horoscope: వారికి అదృష్ట యోగం.. రవి, బుధుల కలయికతో కష్టనష్టాల నుంచి విముక్తి..!
ఈ నెల 16 నుంచి డిసెంబర్ 16 వరకూ వృశ్చిక రాశిలో రవి, బుధుల కలయిక జరుగుతుంది. దీని వల్ల బుధాదిత్య యోగమనే అదృష్ట యోగం ఏర్పడుతుంది. ఈ యోగం రవికి మిత్ర క్షేత్రమైన వృశ్చిక రాశిలో ఏర్పడడం వల్ల పూర్తి స్థాయి బుధాదిత్య యోగం పట్టే అవకాశం ఉంది.
ఈ నెల 16 నుంచి డిసెంబర్ 16 వరకూ వృశ్చిక రాశిలో రవి, బుధుల కలయిక జరుగుతుంది. దీని వల్ల బుధాదిత్య యోగమనే అదృష్ట యోగం ఏర్పడుతుంది. ఈ యోగం రవికి మిత్ర క్షేత్రమైన వృశ్చిక రాశిలో ఏర్పడడం వల్ల పూర్తి స్థాయి బుధాదిత్య యోగం పట్టే అవకాశం ఉంది. వృషభం, సింహం, తుల, వృశ్చికం, మకరం, కుంభ రాశులను ఈ యోగం అనేక సమస్యలు, కష్టనష్టాల నుంచి బయటకు తీసుకు రావడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో అనేక విధాలుగా ప్రయో జనాలు పొందడం జరుగుతుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది.
- వృషభం: ఈ రాశికి 4, 5 స్థానాల అధిపతులుగా అత్యంత శుభులైన రవి, బుధులు సప్తమ స్థానంలో కల వడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో విశేషంగా అభి వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది. రాజకీయ ప్రముఖులతో లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఇంటా బయటా జీవి తం రాజసంగా సాగిపోతుంది. మీ సలహాలు, సూచనల వల్ల బంధుమిత్రులు లబ్ధి పొందుతారు.
- సింహం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాశ్యధిపతి రవి, ధనాధిపతి బుధుడు యుతి చెందడం వల్ల గృహ, వాహన ప్రయత్నాల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు. ఆస్తిపాస్తులు సమకూరే అవకాశం ఉంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వర్గాలతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశికి ధన స్థానంలో భాగ్య, లాభాధిపతులు కలవడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వారితో లాభదాయక సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో, కొన్ని మార్పులతో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ పని తీరుకు, మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందివస్తాయి.
- వృశ్చికం: ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలోనే కాక, సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. హోదాలు పెరుగుతాయి. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమతో పాటు లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి.
- మకరం: ఈ రాశికి లాభస్థానంలో బుధ, రవుల కలయిక వల్ల అనేక దోషాలు, సమస్యలు, కష్టనష్టాలు తొలగిపోతాయి. ప్రశాంత జీవితం గడపడానికి అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో హోదాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి అభి వృద్ది దిశగా పయనిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
- కుంభం: ఈ రాశికి దశమ స్థానంలో బుధాదిత్య యోగం వంటి ఉత్తమ యోగం పట్టడం వల్ల ఉద్యోగంలో కీల కమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారడానికి మార్గం సుగమం అవు తుంది. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మనసులోని కోరికలు నెరవేరుతాయి.